- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mahakumbh 2025: మహాకుంభమేళలో 14మంది పిల్లలు జననం.. ఏం పేర్లు పెట్టారో తెలుసా?
Mahakumbh 2025: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Mahakumbh 2025)కు దేశం, ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తరలివస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : Mahakumbh 2025: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Mahakumbh 2025)కు దేశం, ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తరలివస్తున్నారు. ఈ కుంభమేళాలో భాగంగా 14మంది గర్భిణీలు కూడా పవిత్ర స్నానమాచరించారు. మహా కుంభమేళా సెంట్రల్ హాస్పిటల్(Central Hospital)లో మొదటి ప్రసవం డిసెంబర్ 29, 2024న జరిగింది. కౌశాంబికి చెందిన సోనమ్ (20) ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. ఆమె కుటుంబం అతనికి 'కుంభ్' అని పేరు పెట్టింది.
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా(Mahakumbh 2025)లో స్నానమాచరించడానికి భక్తులు పెద్దెత్తున తరలివస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 60కోట్ల మంది భక్తులు పుణ్య స్నానం ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ఈ కుంభమేళాకు తరలివస్తున్నారు. ప్రధాని మోదీ(PM MODI) నుంచి అత్యంత ధనిక పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ(Mukesh Ambani) వరకు అందరూ మహా కుంభమేళాలో గంగానదిలో స్నానం చేశారు.
అయితే ఈ కుంభమేళా కొంతమందికి సంతోషం మిగుల్చితే మరికొందరికి విషాదం మిగిల్చింది. ఇంకొందరిని రాత్రికి రాత్రే సెలబ్రిటీలను చేసింది. మహా కుంభ్ కు వెళ్తున్న భక్తులతో ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించారు. అంత ముందు ప్రయాగ్ రాజ్ లో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 18 మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే తాజాగా కుంభమేళాకు సంబంధించి మరొక వార్త వైరల్ అవుతుంది.ఈ కుంభమేళాలో గర్భిణీలు కూడా పుణ్యస్నానం చేశారు.
కుంభమేళా ప్రారంభమైన నెలలోనే 14 మంది పిల్లలు జన్మించారు. వారిలో 8 మంది అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. కుంభమేళా సందర్భంగా పవిత్ర స్నానం చేసిన వీరందరికి సాధారణ ప్రసవం జరిగిందని సెంట్రల్ ఆసుపుత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్(Chief Medical Superintendent of Central Hospital) డాక్టర్ మనోజ్ కౌశిక్ తెలిపారు. ఈ ఆసుపత్రిలో ప్రసవించిన మహిళలు ఉత్తరప్రదేశ్ లోని బందా, చిత్రకూట్, కౌశాంబి, జౌన్ పూర్ తోపాటు జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చినట్లు తెలిపారు.
వీరిలో కుంభ స్థలంలో పనిచేస్తున్న తాత్కాలిక క్లాస్ 4 ఉద్యోగులు భార్యలు, మరికొందరు కుంబ్ కు వచ్చిన వ్యాపార కుటుంబాలకు చెందినవారు ఉన్నారు. కుంభమేళాకు గుర్తుగా వారికి కుంభ, గంగా, యమునా, నంది వంటి పేర్లు పెట్టారు. కాగా వీరంతా కుంభమేళా సమయంలో సెక్టార్-2లో నిర్మించిన 100 పడకల సెంట్రల్ హాస్పిటల్‌లో జన్మించారు.
కుంభమేళాకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో 2024 డిసెంబర్ 29న మొదటి ఆ ఆసుపత్రిలో బాబు జన్మించాడు . అతనికి కుంభ అని పేరు పెట్టారు. మరుసటి రోజు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమెకు గంగ అని పేరు పెట్టారు. మహా కుంభమేళాలో జన్మించిన ఈ 14 మంది శిశువులకు ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాతిపదికన పేర్లు పెట్టారు. కుటుంబ సభ్యులు వారికి కుంభ్, గంగా, బజరంగీ, యమునా, సరస్వతి, నంది, బసంత్, బసంతి, అమృత్, శంకర్, కృష్ణ, అమావాస్య మొదలైన పేర్లు పెట్టారు.
సెక్టార్-2లో నిర్మించిన 100 పడకల సెంట్రల్ ఆసుపత్రిలో నలుగురు గైనకాలజిస్టులు సహా 105 మంది వైద్య నిపుణులు బృందం ఉంది. కుంభ్ ప్రాంతంలోని పరేడ్ గ్రౌండ్ సమీపంలో ఉన్న 100 పడకల ఆసుపత్రిలో OPD, జనరల్ వార్డు, డెలివరీ సెంటర్, ICU, ఆపరేషన్ థియేటర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఆసుపత్రి క్లినికల్ సేవలను కూడా అందిస్తుంది. పురుషులు, మహిళలు, పిల్లలకు ప్రత్యేక వార్డులను కలిగి ఉంది.






