ప్రయాగ్‌రాజ్‌లో నిషేధాజ్ఞలు.. ముందు జాగ్రత్తగా ఉత్తర్వులు జారీ

by Ajay Maddhiboyina |

భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (2023) సెక్షన్ 163 ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

ప్రయాగ్‌రాజ్‌లో నిషేధాజ్ఞలు.. ముందు జాగ్రత్తగా ఉత్తర్వులు జారీ
X

- వెల్లడించిన అడిషనల్ కమిషనర్

దిశ, నేషనల్ బ్యూరో:

మహాకుంభమేళ జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌లో నిషేధాజ్ఞలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని శుక్రవారం ప్రయాగ్‌రాజ్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. మహాకుంభ మేళ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు గాను ముందు జాగ్రత్త చర్యగా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (2023) సెక్షన్ 163 ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అత్యవసర అంశం కావడంతో ముందస్తుగా ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే ఉత్తర్వులు అమలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మహాకుంభమేళాతో పాటు రిపబ్లిక్ డే, మౌని అమావాస్య, బసంత్ పంచమి, సంత్ రవిదాస్ జయంతి, మాఘి పూర్ణిమ, వేలంటైన్స్ డే, షాబ్ ఏ బారాత్, మహాశివరాత్రి వంటి ప్రత్యేక రోజులతో పాటు పలు కాంపిటేటీవ్ ఎగ్జామ్స్ కూడా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అడిషనల్ సీపీ తెలిపారు.

Next Story