Mahakhumb: మహాకుంభమేళా భక్తులకు షాక్.. ఆ నదిలో అధిక మోతాదులో బ్యాక్టీరియా గుర్తింపు

by B.Srinivas |

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ నగరంలో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.

Mahakhumb: మహాకుంభమేళా భక్తులకు షాక్.. ఆ నదిలో అధిక మోతాదులో బ్యాక్టీరియా గుర్తింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ నగరంలో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 50కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారు. అయితే భక్తులు పవిత్ర స్నానం చేసే పలు ప్రాంతాలకు సంబంధించి కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) వెల్లడించిన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహా కుంభమేళా టైంలో గంగా నది బ్యాక్టీరియాతో కలుషితమైందని వివిధ ప్రాంతాల్లో స్నానానికి అవసరమైన నీటి నాణ్యత లేదని, ఫెకల్ కోలిఫాం బ్యాక్టీరియా పరిమాణం పెరిగిందని తెలిపింది. ఈ మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు తాజాగా ఓ నివేదికను అందజేసింది. మురుగునీటి కాలుష్యానికి సూచిక అయిన ఫెకల్ కోలిఫాం పరిమితి 100 మిల్లీలీటర్లకి 2500 యూనిట్లు ఉంటుందని కానీ ప్రయాగ్ రాజ్ ప్రాంతంలోని నదిలో ఎక్కువగా ఉందని పేర్కొంది.

‘వివిధ సందర్భాలలో పర్యవేక్షించబడిన అన్ని ప్రదేశాల్లో ఫెకల్ కోలిఫాం (FC) పరంగా స్నానం చేయడానికి అవసరమైన నీటి నాణ్యత అనుగుణంగా లేదు. ఫెకల్ కోలిఫాం బ్యాక్టీరియా ఎక్కువగా ఉంది. ఇది నీటి నాణ్యతను పాడు చేస్తుంది. శరీరానికి హానికరం కావొచ్చు, కాలుష్యం సైతం పెరుగుతోంది’ అని తెలిపింది. కాగా, ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యమునా నదులలోకి మురుగునీటి విడుదలను నిరోధించే అంశాన్ని ఎన్టీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, జ్యుడీషియల్ సభ్యుడు జస్టిస్ సుధీర్ అగర్వాల్, సెంథిల్ వేల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ నేపథ్యంలోనే దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయగా సీపీసీబీ తాజాగా అందజేసింది.

కాగా, కోలిఫాం అనేది అనేక బ్యాక్టీరియాలను కలిగి ఉన్న ఒక సమూహం. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. ఈ బ్యాక్టీరియా మానవులు, జంతువుల ప్రేగులు, మలంలో కనిపిస్తుంది. ఇది ఎటువంటి ప్రమాదకరమైన హానీ కలిగించదు. కానీ నీటిలో దాని ఉనికి ఇతర ప్రమాదకరమైన బ్యాక్టీరియా తయారయ్యే చాన్స్ ఉంటుందని తెలుస్తోంది.

Next Story