- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ అగ్ని ప్రమాదం.. పొగతో నిండిపోయిన మెట్రో రైలు.. ఆందోళనకరంగా ప్రయాణికుల పరిస్థితి.. (వీడియో)
ముంబై మెట్రో రైలులో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. కంపార్ట్‌మెంటులన్నీ పొగచూరుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టంగా మారినట్లు చెప్తున్నారు ప్రయాణికులు. అసలు ఏం జరిగిందంటే..

దిశ, వెబ్‌సైట్ : ముంబై మెట్రో రైలులో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. కంపార్ట్‌మెంటులన్నీ పొగచూరుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టంగా మారినట్లు చెప్తున్నారు ప్రయాణికులు. అసలు ఏం జరిగిందంటే.. ముంబైలోని బోరివలి వద్ద వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై దేవీపాడ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ టైమ్‌లో స్టేషన్ వద్ద మెట్రో రైలు ఆగినప్పుడు.. డోర్స్ ఓపెన్ కాగానే పొగ రైలు కోచ్‌లోకి ప్రవేశించింది. పరిస్థితిని దిగజార్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రయాణికులు మెట్రో అత్యవసర స్పందనను విమర్శించారు. ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ప్రయాణికులకు ఎటువంటి ప్రకటనలు లేదా వైద్య పరీక్షలు లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు, డ్రైవర్‌లెస్ మెట్రో వ్యవస్థలో భద్రతా ప్రోటోకాల్‌లపై ప్రశ్నలు లేవనెత్తారు.
అయితే మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMMOCL) దీనిపై ప్రకటన విడుదల చేసింది. స్టేషన్ ఓపెన్ డిజైన్ వల్ల పొగ తాత్కాలికంగా ప్లాట్‌ఫామ్‌పైకి, కోచ్‌లోకి చేరిందని వివరించింది. తదుపరి స్టేషన్‌లో పరిస్థితిని నియంత్రించామని.. రైలు లోపల ఎటువంటి మంటలు లేదా ప్రమాదం లేదని తెలిపింది. ఇక అగ్ని ప్రమాదం జరిగిన బస్సు ఖాళీగా ఉందని, ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని.. అగ్నిమాపక సిబ్బంది, మెట్రో సిబ్బంది త్వరగా స్పందించి మంటలను అదుపు చేసినట్లు తెలుస్తోంది.






