- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maha Kumbh Mela : మహాకుంభమేళా..తర్వాతా మళ్లీ కుంభమేళాలు ఎప్పుడు ?
144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా(Prayagraj Maha kumbh Mela) బుధవారం నాటితో ముగియ్యనుండగా..తదుపరి కుంభమేళాలు(Next Kumbh Melas)ఎప్పుడు..ఎక్కడన్న ప్రశ్నలు సర్వత్రా నెలకొన్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : 144ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా(Prayagraj Maha kumbh Mela) బుధవారం నాటితో ముగియ్యనుండగా..తదుపరి కుంభమేళాలు(Next Kumbh Melas)ఎప్పుడు..ఎక్కడన్న ప్రశ్నలు సర్వత్రా నెలకొన్నాయి. జనవరి 13న ప్రారంభమైన ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజుతో పూర్తికానుంది. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా నిలిచిన ఈ మహాకుంభమేళాలో 65 కోట్లకు పైగా భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర పుణ్యస్నానాలు చేశారు. ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా తర్వాతా రాబోయే ఐదేళ్లలో నాలుగు కుంభమేళాలు జరుగనున్నాయి. వాటిలో 2027లో హరిద్వార్(Haridwar Kumbh), 2027లో నాసిక్(Nashik Kumbh Mela), 2028లో ఉజ్జయిని(Ujjain Simhastha Kumbh), 2030లో ప్రయాగ్‌రాజ్(Prayagraj Ardha Kumbh Mela)లో జరగనున్నాయి.
హరిద్వార్ కుంభ్ (2027)
హరిద్వార్‌లో కుంభమేళా, అర్ధ కుంభమేళా రెండూ నిర్వహించబడతాయి. కుంభమేళా 12 సంవత్సరాల తర్వాత నిర్వహించబడుతుండగా.. అర్ధ కుంభమేళా 6 సంవత్సరాల తర్వాత నిర్వహించబడుతుంది. దీంతో ముందుగా అర్ధ కుంభమేళా 2027లో హరిద్వార్‌లో ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి. చివరి అర్ధ కుంభమేళా 2021లో హరిద్వార్‌లోనే జరిగింది.
నాసిక్ కుంభమేళా (2027)
12 సంవత్సరాల తర్వాత 2027లో నాసిక్‌లో కుంభమేళా జరగనుంది. ప్రస్తుత సమాచారం మేరకు జూలై 17, 2027న ప్రారంభమై ఆగస్టు 17న ముగుస్తుంది. గోదావరి నది పవిత్ర ఒడ్డున నాసిక్ నుండి దాదాపు 38 కి.మీ దూరంలో ఉన్న త్రయంబకేశ్వర్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కుంభమేళాను గతంలో 2015లో నిర్వహించారు.
ఉజ్జయిని సింహస్థ కుంభ్ (2028)
ఉజ్జయినిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి శిప్రా నది ఒడ్డున సింహస్థ కుంభమేళా నిర్వహించబడుతుంది. ఈ దఫా 2028లో జరగనుంది. ఉజ్జయిని సింహస్థ కుంభ మేళాకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. ఇందుకోసం ఉజ్జయినిలో దాదాపు 3,300 హెక్టార్ల విస్తీర్ణంలో ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ప్రయాగ్‌రాజ్ అర్ధ కుంభమేళా (2030)
మహాకుంభ మేళా జరిగిన ప్రయాగ్ రాజ్ లోనే 2030లో ప్రయాగ్‌రాజ్ అర్ధ కుంభమేళా జరుగనుంది. హరిద్వార్ లాగా.. కుంభమేళా, అర్ధ కుంభమేళా రెండింటినీ ప్రయాగ్‌రాజ్ నిర్వహిస్తుంది.






