Maha Kumbh Mela : మహాకుంభ మేళాలో 27కోట్లు దాటిన భక్త జనం

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-30 15:27:01  IST  )

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj) మహాకుంభ మేళా(Maha Kumbh Mela)లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తజనం(Devotees)పోటెత్తుతుంది.

Maha Kumbh Mela : మహాకుంభ మేళాలో 27కోట్లు దాటిన భక్త జనం
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj) మహాకుంభ మేళా(Maha Kumbh Mela)లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తజనం(Devotees)పోటెత్తుతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన మహా కుంభ మేళా గురువారానికి 18వ రోజుకు చేరుకుంది. కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ అంటే జనవరి 29 నాటికి 27 కోట్ల మంది భక్తులు సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఇక ఇవాళ ఉదయం 8 గంటల వరకూ దాదాపు 55 లక్షల మంది నదీ స్నానాలు ఆచరించినట్లు తెలిపింది. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. మరోవైపు కుంభమేళలో పవిత్ర దినంగా భావించే మౌని అమావాస్య బుధవారం రోజున ఏకంగా 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వం తెలిపింది. బుధవారం ఒక్కరోజే 9-10 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌లో ఉన్నారని అధికారులు ప్రకటించారు.

గంగా, యయున, సరస్వతీ నదులు ప్రయాగ్‌రాజ్‌లో ఒకటిగా కలిసే త్రివేణి సంగమంలో పుష్య మాసం పౌర్ణమి సందర్భంగా జనవరి 13న మహా కుంభమేళా వేడుకలు మొదలయ్యాయి. దాదాపు 45 రోజుల పాటు కొనసాగి.. ఫిబ్రవరి 26తో ముగుస్తాయి. మహా కుంభ మేళాలో ప్రత్యేక పుణ్య స్నానాలు జనవరి 13న పుష్య పౌర్ణమి రోజున, జనవరి 15న మకర సంక్రాంతి రోజున, జనవరి 29 మౌని అమావాస్య రోజున, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి, కుంభమేళ ముగింపు ఫిబ్రవరి 26 మహా శివరాత్రి రోజున పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఆధ్యాత్మిక ఉత్సవానికి యూపీ ప్రభుత్వం రూ.2100కోట్ల స్పెషల్‌ గ్రాంట్‌ మంజూరు చేసింది.

ప్రయాగ్ రాజ్ లోనే మహాకుంభ మేళా

సాధారణంగా ఏటా కుంభమేళా నాలుగు ప్రాంతాల్లో జరుగుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్‌ కుంభమేళాలో జరుగుతుంది. అయితే, 144 సంవత్సరాలకోసారి జరిగే మహా కుంభమేళా మాత్రం కేవలం ప్రయాగ్‌రాజ్‌లోనే నిర్వహిస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో మహా కుంభమేళా మొదలవుతుంది. భూమిపై ఏడాది దేవతలకు ఒకరోజుతో సమానం. దేవతలు, రాక్షసుల మధ్య 12 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. పన్నెండేళ్లకోసారి పూర్ణకుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే.. భూమిపై 144 సంవత్సరాలకు సమానం అవుతుంది. అందుకే 144 సంవత్సరాలకోసారి మహా కుంభమేళా జరుగుతుంది. ఈ మహా కుంభమేళాను కేవలం ప్రయాగ్‌రాజ్‌లోనే నిర్వహిస్తారు. గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమం కావడంతో ప్రయాగ్‌రాజ్‌లోనే జరుగుతుంది. మహా కుంభమేళాకు దాదాపు 850 సంవత్సరాలకుపైగా చరిత్ర ఉందని చరిత్రకారులు పేర్కొంటున్నారు.

మూడు రకాల కుంభమేళాలు

కుంభమేళా మూడు రకాలుగా పండితులు పేర్కొన్నారు. అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, మహా కుంభమేళా జరుగుతుంది. ప్రతి ఆరు సంవత్సరాలకోసారి నిర్వహించేది అర్ధ కుంభమేళా జరుగుంది. చివరి అర్ధకుంభమేళా 2019లో జరిగింది. ఇక ప్రతి 12 సంవత్సరాలకోసారి నిర్వహించేదాన్ని పూర్ణ కుంభమేళాగా పిలుస్తుంటారు. చివరిసారిగా పూర్ణ కుంభమేళా 2013లో జరిగింది. 12 పూర్ణ కుంభమేళాల తర్వాత.. 144 ఏళ్లకు ఒకసారి వచ్చేదే మహా మేళా. అది ఈ సారి ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్నది మహా కుంభమేళా. ఈ మహా కుంభమేళాను చూడడం అదృష్టమని.. ప్రతి మూడు తరాల్లో ఒక్కరికి మాత్రమే ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశం దక్కుతుందని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు. చివరగా 2013లో జరిగిన కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులతో పాటు సాధువులు మొత్తంగా 20 కోట్ల వరకు హాజరయ్యారని అంచనా. ఈ సారి మహా కుంభమేళాకు దాదాపు 40కోట్లకుపైగా వస్తారని అంచనా వేస్తున్నారు.

Next Story