- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mamata Banerjee: మహాకుంభ్ కాదు.. మృత్యు కుంభ్- యోగి సర్కారుపై దీదీ విమర్శలు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రసంగిస్తూ ఉత్తరప్రదేశ్ సర్కారుపై ధ్వజమెత్తారు. ప్రయాగ్ రాజ్ లో జరుగుతోంది మహాకుంభమేళా కాదని.. మృత్యుకుంభ్ అని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై దీదీ విరుచుకుపడ్డారు. ఇటీవల కుంభమేళాలో, ఢిల్లీ రైల్వే స్టేషన్లలలో జరిగిన తొక్కిసలాట ఘటనలను ప్రస్తావించారు. వీఐపీలకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుండగా, పేదలకు అవసరమైన సౌకర్యాలు లభించకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం "దేశాన్ని విభజించడానికి మతాన్ని అమ్మేస్తోందని" అన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు సరైన ప్రణాళిక లేదని ఆరోపించారు. "ఈ కార్యక్రమంపై అతిగా ప్రచారం ఎందుకు చేశారు? అలా చేసినప్పుడు కనీసం సరైన ప్రణాళికలైనా అమలులో ఉండాలి. తొక్కిసలాట ఘటన తర్వాత తర్వాత కుంభమేళాకు ఎన్ని కమిషన్లను పంపారు?" అని ముఖ్యమంత్రి దీదీ ప్రశ్నించారు.
తొక్కిసలాట ఘటనలు
మౌని అమావాస్య సందర్భంగా గత నెల 29వ తేదీన కుంభమేళా ప్రాంతంలో తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 60 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ. 25 లక్షల పరిహారం ప్రకటించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిపై న్యాయ విచారణకు ఆదేశించారు. న్యాయ కమిటీ తన నివేదికను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుందని చెప్పారు. మరోవైపు, ఢిల్లీ రైల్వే స్టేషన్లోని ప్లాట్‌ఫాం నంబర్ 16పై శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో తొక్కిలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది చనిపోయారు. పలువురికి గాయల్యయాయి. ఢిల్లీ రైల్వే స్టేషన్లోని ప్లాట్‌ఫాం నంబర్ 16పై శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో తొక్కిలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది చనిపోయారు. పలువురికి గాయల్యయాయి. ఇకపోతే, 144 ఏళ్లకోసారి వచ్చే ఈ మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది.






