మాఘ పూర్ణిమ ఎఫెక్ట్.. ఆయోధ్య కు పోటెత్తిన భక్తులు

by Mahesh |   ( Updated:2025-02-12 05:13:24.0  )
మాఘ పూర్ణిమ ఎఫెక్ట్.. ఆయోధ్య కు పోటెత్తిన భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రయాగ్ రాజ్ (Prayag Raj)లో జరుగుతున్న మహాకుంభమేళ (Mahakumbh Mela) కారణంగా ఉత్తరప్రదేశ్ లోని అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలతో (Famous shrines) పాటు, పర్యాటక కేంద్రాలకు (Tourist centers) ఒక్కసారిగా మహార్ధశ (Maharadsha) ఏర్పడింది. జనవరి 13న కుంభమేళా ప్రారంభం కాగా.. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh0 కు ప్రతి రోజు కోట్లాది మంది ప్రజలు (Millions of people) వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు. దీంతో ఆ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వ్యాపారం (business) భారీగా పెరిగిపోయింది. ఇదిలా ఉంటే ఈ కుంభమేళ ఎఫెక్ట్ అత్యధికంగా అయోధ్య (Ayodhya)పై పడింది. ప్రయాగ్ రాజ్ వెళ్లే భక్తులు 90 శాతం మంది కచ్చితంగా అయోధ్య రామ మందిరాన్ని సందర్శించుకుని వెళ్తున్నారు. లేదా ముందస్తుగా అయోధ్యకు చేరుకొని శ్రీరాముడిని దర్శించుకున్న అనంతరం ప్రయాగ్ రాజ్ (Prayag Raj) వెళ్తున్నారు.

దీంతో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులతో (Lakhs of devotees) అయోధ్య నగర వీధులన్ని (Streets of Ayodhya city) నిండిపోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు మాఘపూర్ణిమ (Maghapurnima) కావడంతో అయోధ్యకు భక్తులు పోటెత్తారు. మంగళవారం సాయంత్రానికి భారీగా అక్కడికి చేరుకున్న భక్తులు సరయూ నది (Sarayu River)లో పుణ్య స్నానాలు చేసుకొని రామ్ లల్ల (Ram Lalla)ను దర్శించుకునేందుకు లైన్లలో క్యూ కట్టారు. దీంతో ఉదయం నుంచి అయోధ్యలో భక్తుల రద్ధీ (Crowd of devotees in Ayodhya) భారీగా పెరిగిపోయింది. దీనికి తోడు ప్రయాగ్‌రాజ్‌లో పవిత్ర స్నానాలు ఆచరించిన వారిని వేగంగా అక్కడి నుంచి తరలిస్తుండటంతో వారంతా నేరుగా అయోధ్యకు చేరుకుంటున్నారు.

దీంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయినట్లు అధికారులు (Officers) తెలిపారు. అయితే పెరిగిన భక్తుల రద్దీ (Crowd of devotees)ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు వారికి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా స్థానికుల సాయంతో ఎండలో నిల్చున్న భక్తులకు నీరు, మజ్జిగ వంటి పానీయాలు అందిస్తున్నారు. అయితే ఈ కుంభమేళా (Kumbh Mela) ప్రారంభం అయినప్పటి నుంచి అయోధ్యలో భక్తుల రద్ధీ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజు కనీసం 5 లక్షల మంది శ్రీరాముడిని దర్శించుకుంటున్నారు. అత్యధికంగా ఒకే రోజులో 25 లక్షల మంది భక్తులు అయోధ్యకు వచ్చినట్లు స్థానిక మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి కుంభమేళా కారణంగా భారత దేశంలోని అన్ని మార్గాలు ప్రస్తుతం యూపీ వైపు వెళ్తున్నాయి. మాఘపూర్ణిమ సందర్భంగా ఈ రోజు ఒక్కరోజు కుంభమేళలో 2 నుంచి 5 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేస్తారనే అంచనాలు ఉండటంతో.. యూపీ ప్రభుత్వం (UP Govt) ప్రయాగ్ రాజ్ ను నో వెహికల్ జోన్ (Prayag Raj is a no vehicle zone)గా ప్రకటించింది. అలాగే వీఐపీ సేవలను కూడా నిలిపివేసినట్లు తెలుస్తుంది.

Next Story

Most Viewed