Jallikattu : మదురై జల్లికట్టు పోటీలో గెలిచిన యువకుడికి కళ్ళు చెదిరే బహుమతులు

by Muthe.Rajitha |

సంక్రాంతి పండుగ(Sankranthi Festival)కు తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలు(Kodi pandalu) ఎంత ఫేమసో.. తమిళనాడు(Tamil Nadu)లో జల్లికట్టు(Jallikattu) అంతకంటే ఫేమస్.

Jallikattu : మదురై జల్లికట్టు పోటీలో గెలిచిన యువకుడికి కళ్ళు చెదిరే బహుమతులు
X

దిశ, వెబ్ డెస్క్ : సంక్రాంతి పండుగ(Sankranthi Festival)కు తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలు(Kodi pandalu) ఎంత ఫేమసో.. తమిళనాడు(Tamil Nadu)లో జల్లికట్టు(Jallikattu) అంతకంటే ఫేమస్. పండగ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జల్లికట్టు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. భారీ సంఖ్యలో ఎద్దులను జల్లికట్టులోకి దించగా.. వాటికి కట్టిన పలకలు అందుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. ఇక మదురై(Madurai)లోని అలంగనల్లూరులో జల్లికట్టు పోటీలు భారీ ఎత్తున నిర్వహించారు. ఏకంగా వెయ్యి ఎద్దులు పోటీల్లో పాల్గొనగా.. 600 మందికి పైగా యువకులు పలకలు అందుకోవడానికి ఎగబడ్డారు. రెండు రోజులు కొనసాగిన ఈ పోటీల్లో గెలిచిన యువకుడికి కారు, ట్రాక్టర్, ఆటో బహుమతిగా అందించారు. దాదాపు 2 వేల మంది పోలీసు సిబ్బందితో ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేసింది. కాగా ఎద్దుల కాళ్ళ కింద పడి 30 మంది దాకా నలిగి పోగా.. ఒక యువకుడు మృతి చెందడం పండగపూట వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.

Next Story