- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీఎంకే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. కొండపై కార్తీకదీపానికి లైన్ క్లియర్
మదురైలోని తిరుప్పరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించడంపై నెలకొన్ని వివాదానికి తెరపడింది. ఈ వివాదంలో తమిళనాడు డీఎంకే ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్ : మదురైలోని తిరుప్పరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించడంపై నెలకొన్ని వివాదానికి తెరపడింది. ఈ వివాదంలో తమిళనాడు డీఎంకే ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కొండపై ఉన్న దర్గా సమీపంలోని రాత్రి స్తంభం వద్ద కార్తీక దీపాన్ని వెలిగించుకునేందుకు అనుమతినిస్తూ మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీనిపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్ని సమర్థించింది. ఈ మేరకు జస్టిస్ జి జయచంద్రన్, జస్టిస్ కెకె రామకృష్ణన్లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
రాజకీయాలకోసం దిగజారుతారా అంటూ చురకలు
తమిళనాడు డీఎంకే ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు, దర్గా కమిటీ.. కొండపై కార్తీకదీపాన్ని వెలిగించడంపై దాఖలు చేసిన అప్పీళ్లను కోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది. ఏడాదికి ఒకసారి.. కార్తీకమాసంలో జరిగే కార్తీక దీపారాధన వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తప్పుపట్టింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఏ ప్రభుత్వం ఇలా దిగజారదని ధర్మాసనం చురకలు అంటించింది. రాతి స్తంభం వద్ద దీపం వెలించకుండా ఉండాలని పేర్కొన్నట్లు ఎలాంటి ఆగమ శాస్త్రాలు, బలమైన సాక్ష్యాధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. మదురై కలెక్టర్, పోలీస్ కమిషనర్, హిందూ ధార్మిక సంస్థల శాఖ లేవనెత్తిన అభ్యంతరాలను కోర్టు కొట్టివేసింది.






