- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కులం పేరుతో ఆలయ ప్రవేశం అడ్డుకోవడం నేరం..తేల్చిచెప్పిన మద్రాస్ హైకోర్టు
కులం పేరుతో ఆలయ ప్రవేశం అడ్డుకోవడం నేరమని, చట్టప్రకారం నడిచే దేశంలో ఇది తగదని మద్రాస్ హైకోర్టు తేల్చిచెప్పింది.

దిశ, నేషనల్ బ్యూరో: చట్టప్రకారం నడిచే దేశంలో కులవివక్షకు తావులేదని మద్రాస్ హైకోర్టు తేల్చిచెప్పింది. ఉదయార్పాలయం తాలూకాలో ఉన్న పుతూకూడి అయ్యనార్ ఆలయంలో ఎస్సీ వర్గానికి చెందిన వారి ప్రవేశాన్ని ఎవరూ అడ్డుకోకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అన్ని వర్గాల ప్రజలు ఆలయంలోని దేవుడికి పూజలు చేసుకునే అవకాశం కల్పించాలని పేర్కొంది. అలాకాకుండా ఎవరైనా అడ్డుకుంటే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
‘ఎవరినైనా కులం పేరుతో ఆలయంలో ప్రవేశించుకుండా అడ్డుకుంటే.. ఇలా అడ్డుకున్న వారు నేరం చేసినట్లే. వారిపై కేసు వేయొచ్చు’ అని జడ్జి ఎన్ ఆనంద్ వెంకటేశ్ స్పష్టంచేశారు. ఎన్నో దశాబ్దాల నుంచి అన్ని వర్గాల ప్రజలు ఈ ఆలయంలో పూజలు చేస్తున్నారని, కానీ 2019లో ఒక వర్గం ఆలయ ప్రాంగణంలో మరో గుడి కట్టాలని నిర్ణయించుకుందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ గుడి నిర్మాణానికి అందరూ ఆర్థిక సహకారం అందించారని, కానీ ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలను గుడిలోకి రాకుండా అడ్డుకున్నారని తెలిపారు.
ఈ ఘటనలపై పోలీసులు, రెవెన్యూ అధికారులకు పలు ఫిర్యాదులు చేసినా.. కొవిడ్-19 కారణంగా దర్యాప్తు ఆలస్యమైనట్లు పిటిషనర్ వెల్లడించాడు. ఈ సమయంలో ఎస్సీ వర్గం ప్రజలు ఏర్పాటు చేసిన వివిధ విగ్రహాలను సదరు ఆలయ బృందం ధ్వంసం చేసిందని పిటిషనర్ ఆరోపించారు.






