Karur stampede : కరూర్ తొక్కిసలాట..వారికి షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు

by Malleboina Mahesh |   (  Updated:2025-10-03 08:15:48  IST  )

తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా.. కరూర్ లో ఏర్పాటు చేసిన సభలో తొక్కిసలాట జరిగింది.

Karur stampede : కరూర్ తొక్కిసలాట..వారికి షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ (Vijay) రాష్ట్ర పర్యటనలో భాగంగా.. కరూర్ లో ఏర్పాటు చేసిన సభలో తొక్కిసలాట (Stampede) జరిగింది. ఇందులో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 80 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతోంది. అయితే ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి.. సీబీఐ విచారణ (CBI investigation) జరిపించాలని టీవీకే పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అలాగే బీజేపీ కౌన్సిలర్ తో పాటు పలువురు కూడా తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ జరపాలని పిటిషన్లు వేశారు. కాగా ఆ పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు (Madras High Court) విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. తొక్కిసలాట ఘటనపై కేసు విచారణ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఈ సమయంలో సీబీఐకు విచారణ అప్పగించమనడం సరికాదని చెప్పుకొచ్చింది. అలాగే కోర్టులను రాజకీయాల కోసం వాడుకోవద్దని, ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ లక్ష్యమని మద్రాస్ హైకోర్టు చేప్పుకొస్తు.. సీబీఐ విచారణ కోసం దాఖలైన పిటిషన్లను కొట్టి (Dismissal of petitions) వేసింది. దీంతో టీవీకే పార్టీతో పాటు ఇతరులకు గట్టి షాక్ తగిలింది.

Next Story