DMK Minister: డీఎంకే మంత్రిపై సుమోటో కేసు నమోదు చేసిన మద్రాస్ హైకోర్టు

by S Gopi |

మంత్రి ప్రసంగం పూర్తిగా ద్వేషపూరితంగా ఉందని గత విచారణ సందర్భంగా జస్టిస్ ఆనంద్ ఆగ్రహంగా అన్నారు.

DMK Minister: డీఎంకే మంత్రిపై సుమోటో కేసు నమోదు చేసిన మద్రాస్ హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల మహిళలను, వర్గాలను కించపరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు అటవీశాఖ మంత్రి, డీఎంకే సీనియర్ నేత కె పొన్ముడిపై మద్రాస్ హైకోర్టు బుధవారం సుమోటోగా కేసు నమోదు చేసింది. గత వారం జరిగిన విచారణ సందర్భంగా పొన్ముడిపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర పోలీసుల‌కు మ‌ద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఒక‌వేళ డీఎంకే నేత‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌కపోతే, తాము సుమోటోగా కేసు న‌మోదు చేస్తామని జ‌స్టిస్ ఎన్ ఆనంద్ వెంక‌టేశ్ హెచ్చరించారు. మంత్రి ప్రసంగం పూర్తిగా ద్వేషపూరితంగా ఉందని గత విచారణ సందర్భంగా జస్టిస్ ఆనంద్ ఆగ్రహంగా అన్నారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా మహిళలను కించపరిచేవిగా ఉన్నాయి. హిందూ మతంలోని రెండు ప్రధాన వైష్ణవ, శైవులపై ఉద్దేశపూర్వకంగా విషం చిమ్మేలా ఉన్నాయి. వారి మధ్య వివాదం రేపేలా మాట్లాడారంటూ కోర్టు పేర్కొంది. గతవారం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 23లోగా మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమిన కారణంగా కోర్టు స్వయంగా కేసు నమోదు చేసి, విచారణ చేపడుతుందని స్పష్టం చేసింది. అంతకుముంచు విచారణ సందర్భంగా.. దీన్నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు. చట్టం అందరికీ ఒకటే. ద్వేషపూరిత ప్రసంగం ఆరోపణలు ఎదుర్కొనే ఇతరులకు వర్తించే చట్టాలే మంత్రులకు కూడా వర్తిస్తాయని జస్టిస్ ఆనంద్ వెల్లడించారు.

Next Story