- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Madhyapradesh: అంబులెన్స్ ఖర్చు భరించలేక మృతదేహాన్ని అడవిలో దహనం చేసిన కుటుంబసభ్యులు
కరైకాడు-పాలార్ చెక్‌పోస్ట్ మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో కాలిపోయిన మృతదేహం లభించిందని బర్గూర్ పోలీసులకు, చెన్నంపట్టి అటవీ రేంజ్ అధికారులకు సమాచారం అందింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఆంబులెన్స్ ఖర్చులను భరించలేక ఓ కుటుంబం మృతదేహానికి అడవిలోనే అంత్యక్రియలు నిర్వహించిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, గత శనివారం రాత్రి కర్ణాటకలోని మలే మహదేశ్వర కొండలకు వెళ్లే రహదారిపై కరైకాడు-పాలార్ చెక్‌పోస్ట్ మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో కాలిపోయిన మృతదేహం లభించిందని బర్గూర్ పోలీసులకు, చెన్నంపట్టి అటవీ రేంజ్ అధికారులకు సమాచారం అందింది. పోలీసులు, అటవీ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ మృతదేహాన్ని కొన్ని గంటల క్రితమే దహనం చేసినట్లు గుర్తించారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన బస్సులో తీర్థయాత్రకు వచ్చిన ఒక బృందం, ఆ ప్రదేశంలోనే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెళ్లడైంది. ఆ ప్రాంతంలోని నిఘా కెమెరాల సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కర్ణాటకకు చేరుకుని పూర్తి వివరాలను సేకరించారు. ఆదివారం (జనవరి 11), పోలీసులు మైసూరులోని శ్రీ చాముండేశ్వరి ఆలయం వద్ద ఆ బస్సును గుర్తించి, అందులోని వారిని విచారించారు. విచారణలో వారు మధ్యప్రదేశ్‌కు చెందినవారని తేలింది. మధురైలోని ఒక ఆలయాన్ని సందర్శిస్తున్నప్పుడు, మూల్ చంద్ పాల్ అనారోగ్యానికి గురయ్యాడు. అతని భార్య సకోత్రపాల్ ఆసుపత్రికి వెళ్దామని సూచించినప్పటికీ, అతను నిరాకరించినట్లు తెలిసింది. అనంతరం, ఆ బృందం మైసూరుకు వెళ్తున్న సమయమంలో మూల్ చంద్ మరణించాడు. అయితే, మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించడానికి రూ. 40,000 ఖర్చును భరించలేక, కుటుంబసభ్యులు మృతదేహాన్ని బస్సులోనే తీసుకువెళ్లారు. ఈరోడ్ అటవీ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు, అడవిలోనే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని వారు నిర్ణయించుకున్నారు. మృతుడి కుటుంబసభ్యులు తమ స్వస్థలానికి తిరిగి వెళ్లారని, అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత బర్గూర్ పోలీసుల ఎదుట హాజరవుతామని అధికారులకు తెలియజేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.






