మడావి హిడ్మా ఇప్పుడెలా ఉన్నాడు? వెలుగులోకి కొత్త ఫోటో

by Ajay Maddhiboyina |

గత కొంతకాలంగా మావోయిస్టుల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హిడ్మా. గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరున్న హిడ్మా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు.

మడావి హిడ్మా ఇప్పుడెలా ఉన్నాడు? వెలుగులోకి కొత్త ఫోటో
X

దిశ, వెబ్ డెస్క్: గత కొంతకాలంగా మావోయిస్టుల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హిడ్మా. గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరున్న హిడ్మా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. ఆయనను పట్టుకునేందుకు బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి. దండకారణ్యంలో వేల మంది బలగాలు కూబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇటీవల హిడ్మా అరెస్ట్ అయ్యారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ నిజానికి అప్పుడు అరెస్ట్ అయ్యింది ఏరియా కమిటీ సభ్యుడు కుంజం హిడ్మా. ఇప్పుడు తాజాగా మడావి హిడ్మా లేటెస్ట్ ఫోటో బయటకు వచ్చింది.

ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న సమయంలో ఆయన ఫోటో బయటకు రావడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు కనిపించిన హిడ్మా ఫోటో 25ఏళ్ల క్రితం దిగినది కాగా ప్రస్తుతం ఆయన వయస్సు 51ఏళ్లు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మా దండకారణ్యంలో పార్టీ శ్రేణులను ముందుండి నడిపిస్తారట. ప్రస్తుతం హిడ్మా కేంద్ర కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 50ఏళ్ల వయసులో కేంద్ర కమిటీలో చోటు దక్కించుకున్న అతిపిన్న వయస్కుడు కూడా హిడ్మానే. ప్రస్తుతం హిడ్మా మిలటరీ దాడులకు పేరున్న పీఎల్‌జీఏలో ఒకటవ బెటాలియన్‌కు సారథ్యం వహిస్తున్నారు. ఆయన తాజా ఫోటో బయటకు రావడంతో హిడ్మా ఎక్కడ ఉన్నారు. ఆయన ఫోటో ఎలా బయటకు వచ్చింది అనే చర్చ మొదలైంది.

Next Story