పెట్రోల్ కష్టాల వేళ బెస్ట్ ఆప్షన్: తక్కువ ధరలోనే లగ్జరీ ఈవీ కార్లు!

by Gantepaka Srikanth |

రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీనికి తోడు భానుడి భగభగలతో ఎండలు మండిపోతుండటంతో, కాస్త బడ్జెట్ కేటాయించి అయినా సరే సొంత కారు కొనుగోలు చేయాలని ప్రజలు భావిస్తున్నారు.

పెట్రోల్ కష్టాల వేళ బెస్ట్ ఆప్షన్: తక్కువ ధరలోనే లగ్జరీ ఈవీ కార్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీనికి తోడు భానుడి భగభగలతో ఎండలు మండిపోతుండటంతో, కాస్త బడ్జెట్ కేటాయించి అయినా సరే సొంత కారు కొనుగోలు చేయాలని ప్రజలు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇంధనాన్ని పొదుపు చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. సామాన్యుల నుంచి విఐపీల వరకు ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు.పెట్రోల్ కష్టాల నుంచి శాశ్వత ఉపశమనం కలిగిస్తూ, మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తున్న కొన్ని బెస్ట్ ఈవీ కార్ల వివరాలు మీకోసం.

ఉన్న బెస్ట్ ఈవీ కార్లు..

టాటా పంచ్ ఈవీ (Tata Punch EV): మధ్యతరగతి ప్రజలకు, సామాన్యులకు ఇది మోస్ట్ అఫర్డబుల్ ఛాయిస్. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.9.69 లక్షల నుంచే ప్రారంభమవుతుంది. టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV): ఈవీ సెగ్మెంట్లో దూసుకుపోతున్న ఈ కారు ప్రారంభ ధర రూ. 12.49 లక్షలు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 465 కిలోమీటర్ల లాంగ్ రేంజ్ ఇవ్వడం దీని ప్రత్యేకత. సిట్రోయెన్ ఈసీ3 (Citroen eC3): స్టైలిష్ లుక్తో ఆకట్టుకునే ఈ ఫ్రెంచ్ బ్రాండ్ కార్డు ఎక్స్- షోరూమ్ ధర రూ. 12.90 లక్షలుగా ఉంది. ఇది సింగిల్ ఛార్జ్్ప దాదాపు 320 కిలోమీటర్ల మైలేజ్ (రేంజ్) ఇస్తుంది. ఇక మహీంద్రా ఎక్స్ యూవీ 400 (Mahindra XUV400 EV): పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, లగ్జరీ ఫీచర్స్ కోరుకునే వారికీ ఇది బెస్ట్ ఆప్షన్. దీని ప్రారంభ ధర రూ. 15.49 లక్షలు. ఇదీ సింగిల్ ఛార్జ్ 456 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. పెట్రోల్ బిల్లుల భారం తగ్గించుకోవడమే కాకుండా, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఈ ఎలక్ట్రిక్ కార్లు అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. మీ బడ్జెటను బట్టి ఇందులో నచ్చిన కారును ఎంచుకుని లగ్జరీ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.

Next Story