వాటర్‌గన్ రూ. లక్ష, స్వీట్ రూ. 50 వేలు.. హోలీ సందర్భంగా లక్నో వ్యాపారుల వినూత్న ఆలోచనలు

by S Gopi |   (  Updated:2025-03-13 06:32:58  IST  )

వీటి ధర రూ. 8,000 నుంచి రూ. లక్ష వరకు ఉంటుంది. వీటిని కొనేవారు కూడా ఎక్కువే ఉన్నారు.

వాటర్‌గన్ రూ. లక్ష, స్వీట్ రూ. 50 వేలు.. హోలీ సందర్భంగా లక్నో వ్యాపారుల వినూత్న ఆలోచనలు
X

దిశ, నేషనల్ బ్యూరో: హోలీ అంటే సామాన్యులతో పాటు వ్యాపారులకూ కూడా పండుగే. శుక్రవారం దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నో వ్యాపారులు ప్రత్యేకమైన అమ్మకాలను మొదలుపెట్టారు. లక్నోకు చెందిన ఆదేశ్ కుమార్ అనే ఆభరణాల వ్యాపారి ఏకంగా రూ. లక్ష విలువైన వెండి పిచికారీ(వాటర్‌గన్), రెండు చిన్న బకెట్లను అమ్మకానికి పెట్టాడు. ఇలాంటి వెండి వాటర్‌గన్‌లను బహుమతిగా ఇవ్వడం పాత సంప్రదాయమేనని, కొత్తగా పెళ్లయిన కొన్ని కుటుంబాల్లో హోలీ సందర్భంగా వెండి బకెట్, పిచికారీ ఇస్తారని చెప్పారు. 'వధువు కుటుంబం వారు వరుడి కుటుంబీకులకు బుహమతిగా ఇస్తారు. దీన్ని మరింత ప్రత్యేకంగా ఉండేందుకు తాము ఖరీదైన వాటిని రూపొందిస్తాం. వీటి ధర రూ. 8,000 నుంచి రూ. లక్ష వరకు ఉంటుంది. వీటిని కొనేవారు కూడా ఎక్కువే ఉన్నారు. లక్నోలో ఇప్పటివరకూ 1,000 వాటర్‌గన్‌లను విక్రయించామని, చాలామంది రిటైల్ వ్యాపారులు కస్టమర్లు అడుగుతున్నారని చెబుతున్నట్టు' ఆదేశ్ కుమార్ చెప్పారు. భవిష్యత్తులో వీటికి మరింత ప్రాచూత్యం లభిస్తుందనే నమ్మకం ఉందని ఆయన తెలిపారు.

మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లోనే గోండాలోని ఓ స్వీట్ షాప్ 'గోల్డెన్ గుజియా' అనే కొత్త రకం కజ్జికాయను తయారు చేసింది. హోలీ పండుగ సీజన్‌లో స్వీట్ ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో తాము ప్రత్యేకమైన స్వీట్‌ను తీసుకురావాలని అనుకున్నట్టు స్వీట్ షాప్ యజమాని శివకాంత్ చతుర్వేది చెప్పారు. దీని ధర కిలో రూ. 50,000, ఒక్కో ముక్క రూ. 1300 ఉంటుందన్నారు. దీని ధర ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం, గోల్డెన్ గుజియా 24-క్యారెట్ల బంగారం లేయర్‌తో, ప్రత్యేకమైన డ్రై ఫ్రూట్ లోపల ఉండటమేనని వివరించారు.

Read More..

Ranya Rao: యూట్యూబ్‌లో చూసి బంగారం స్మగ్లింగ్ నేర్చుకున్నాను.. అధికారులతో రన్యారావు

Next Story