Ranya Rao: యూట్యూబ్‌లో చూసి బంగారం స్మగ్లింగ్ నేర్చుకున్నాను.. అధికారులతో రన్యారావు

by S Gopi |   (  Updated:2025-03-13 06:03:53  IST  )

తనకు తెలియని నంబర్ల నుంచి కాల్స్ వచ్చాయని,యూట్యూబ్‌లో వీడియోలు చూసి బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం నేర్చుకున్నానని చెప్పారు

Ranya Rao: యూట్యూబ్‌లో చూసి బంగారం స్మగ్లింగ్ నేర్చుకున్నాను.. అధికారులతో రన్యారావు
X

దిశ, నేషనల్ బ్యూరో: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) కస్టడీలో ఉన్న నటి రన్యారావు విచారణ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఆమెను డీఆర్ఐ అధికారులు విచారించరు. ఈ సందర్భంగా.. తాను దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేయడం ఇదే తొలిసారి అని, తనకు తెలియని నంబర్ల నుంచి కాల్స్ వచ్చాయని, యూట్యూబ్‌లో వీడియోలు చూసి బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం నేర్చుకున్నానని చెప్పారు. 'రెండు వారాలుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చాయి, అదేవిధంగా మార్చి 1వ తేదీన ఒక విదేశీ ఫోన్ నంబర్ నుంచి కాల్ చేసిన వ్యక్తి దుబాయ్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 వద్ద ఉన్న గేట్ ఏ వద్దకు వెళ్లమని నాకు సూచించారు. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారాన్ని సేకరించి బెంగళూరులో డెలివరీ చేయమని చెప్పారని రన్యారావు తన వాంగూలంలో పేర్కొన్నారు. దుబాయ్ నుంచి ఇదివరకు ఎప్పుడూ అక్రమంగా బంగారం తీసుకురాలేదు. స్మగ్లింగ్ చేయడం ఇదే తొలిసారి అని గతంలో ఇచ్చిన స్టేట్మెంట్‌కు భిన్నమైన విషయాలు చెప్పినట్టు అధికారులు తెలిపారు.

'సెక్యూరిటీ చెకింగ్ తర్వాత సుమారు 6 అడుగులు ఉన్న వ్యక్తి రెండు ప్లాస్టిక్ కవర్లలో బంగారం ఇచ్చారు. బంగారం ఇచ్చిన తర్వాత అతను వెళ్లిపోయాడు. ఎయిర్‌పోర్ట్ రెస్ట్‌రూమ్‌లో బంగారు కడ్డీలను నా శరీరానికి అతికించుకున్నాను. జీన్స్‌, షూస్‌లో దాచుకున్నాను. ఇదంతా ఎలా చేయాలో యూట్యూబ్ వీడియోల ద్వారా నేర్చుకున్నాను' అని తెలిపారు. అయితే, కాల్ చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని, ఆ వ్యక్తి మాటలను బట్టి ఆఫ్రికన్-అమెరికన్ యాస అనిపించిందన్నారు. బంగారాన్ని ఎవరికి డెలివరీ చేయాలనే విషయం గురించి అడిగినప్పుడు, ఎయిర్‌పోర్ట్ టోల్‌గేట్ దాటిన తర్వాత సర్వీస్ రోడ్డులో వెళ్లాలని తనకు సూచనలిచ్చారు. సిగ్నల్ దగ్గర ఉండే ఆటోలో పెట్టి వెళ్లాలని చెప్పారు. అది ఎవరనేది తనకు తెలియదని రన్యారావు వివరించారు. కాగా, గతంలో ఆమె అమెరికా, ఆఫ్రికా, యూరప్ దేశాలకు వెళ్లానని చెప్పిన నేపథ్యంలో వాటి వివరాల గురించి డీఆర్ఐ అధికారులు ఆరా తీస్తున్నారు.

Read More..

హ్యాపీ యానివర్సరీ అంటూ పెళ్లి ఫొటో షేర్ చేసిన ప్రభాస్ బ్యూటీ.. మీ జంటను చూస్తే కుళ్లుగా ఉందంటున్న నెటిజన్లు

Next Story