- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్కీగా సీట్ బెల్ట్ ఓపెన్ అయింది.. మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్
అహ్మదాబాద్ విమానం ప్రమాదం నుంచి బయటపడిన ఒకేఒక్కడు రమేష్ విశ్వాస్ బెడ్‌పై ఉండి ఇవాళ మీడియాతో మాట్లాడారు.

X
దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్ విమానం ప్రమాదం నుంచి బయటపడిన ఒకేఒక్కడు రమేష్ విశ్వాస్ కుమార్ బెడ్‌పై చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. తాను ఎలా బతికానో తనకే తెలియదని అన్నాడు. అంత పెద్ద భీకర పేలుడు ధాటికి అసలు బతుకుతానని కలలో కూడా ఊహించలేదని తెలిపాడు. నిజంగా ఇది అశ్చర్యంగా ఉందన్నాడు. ప్రమాద సమయంలో సీట్ బెల్ట్ తీయడానికి ప్రయత్నించానని.. అదృష్టవశాత్తు కరెక్ట్ టైమ్‌లో సీట్ బెల్ట్ బెల్ట్ ఓపెన్ అవ్వడం వల్లే ప్రమాదం నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చాడు. తన ముందు ఉన్నోళ్లంతా కళ్లెదుటే చనిపోయారని పేర్కొన్నాడు. టేకాఫ్ అయన అర నిమిషంలోనే అంతా.. అయిపోయిందని అన్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ తనను పరామర్శించారని.. ఆరోగ్యం ఎలా ఉందని అడిగారని రమేష్ విశ్వాస్ కుమార్ మీడియాకు తెలిపారు.
Next Story






