- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తగ్గిన ఇంజిన్ ఆయిల్ ప్రెజర్.. ఎయిరిండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
విమానాల్లో వరుస సాంకేతిక సమస్యలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: విమానాల్లో వరుస సాంకేతిక సమస్యలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఇవాళ ఉదయం ఎయిరిండియా (Air India)కు చెందిన (ఫ్లైట్ నెంబర్: AI887) ఫ్లైట్ ఢిల్లీ (Delhi) నుంచి ముంబై (Mumbai)కి టేకాఫ్ అయింది. అయితే, కొద్దిసేపట్లోనే సాంకేతిక సమస్య కారణంగా మళ్లీ ఢిల్లీకి తిరిగి వచ్చింది. కుడి వైపు ఇంజిన్‌లో ఆయిల్ ప్రెషర్ ఒకసారిగా తగ్గి జీరోకు చేరుకోవడంతో పైలట్లు అత్యవసరంగా విమానాన్ని వెనక్కి మళ్లించారు.
ఈ బోయింగ్ 777-337 ER విమానం తెల్లవారుజామున 3.20కి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ముంబైకి బయలుదేరింది. సమస్యను పైలట్లు ముందే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగారు. అనివార్య పరిస్థితి వల్ల జరిగిన అసౌకర్యానికి ఎయిరిండియా విచారం వ్యక్తం చేస్తూ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. అదేవిధంగా ముంబై వెళ్లేందుకు ప్రత్యామ్నాయ సర్వీసును ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆ ఎయిర్‌లైన్స్ సిబ్బంది ప్రకటించారు.






