ప్రేమోన్మాది ఘాతుకం.. తండ్రి ముందే యువతి గొంతు కోసిన యువకుడు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-26 07:20:34  IST  )

తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటక చోటుచేసుకుంది.

ప్రేమోన్మాది ఘాతుకం.. తండ్రి ముందే యువతి గొంతు కోసిన యువకుడు
X

దిశ, వెబ్ డెస్క్: త‌న‌ను ప్రేమించ‌ట్లేద‌నే కోపంతో ఓ యువ‌కుడు దారుణానికి పాల్పడ్డాడు. కాలేజీకి వెళ్తుండగా అడ్డుకుని యువతి గొంతు కోశాడు. తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట జిల్లాలో శనివారం ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. కలవైకు చెందిన ఓ యువతిని నిందితుడు గత కొంత కాలం ప్రేమిస్తున్నానని వెంటాడుతున్నాడు. అయితే, అతడి ప్రేమను ఆమె తిరస్కరించింది. దీంతో ఆగ్రహానికి లోనైన యువకుడు, శనివారం ఆమె తండ్రి సమక్షంలోనే నిలదీసి గొంతు కోసి పరారయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story