లోక్‌సభలో వాయిదాల పర్వం.. ఓం బిర్లా అఖిలపక్ష భేటీ

by Phanindra |

లోక్‌సభ వరుసగా వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ క్రమంలో స్పీకర్ ఓం బిర్లా.. అఖిలపక్ష భేటీ నిర్వహించారు.

లోక్‌సభలో వాయిదాల పర్వం.. ఓం బిర్లా అఖిలపక్ష భేటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: వరుసగా ఐదో రోజు కూడా పెద్దగా చర్చలేమీ జరగకుండానే పార్లమెంటు వాయిదా పడింది. బిహార్‌లో జరుగుతున్న ప్రత్యేక ఓటరు రివిజన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతలు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు. ఈ క్రమంలోనే వాయిదాల పర్వానికి ముగింపు పలికేందుకు ఓం బిర్లా అఖిలపక్ష భేటీ నిర్వహించారు. సభ సాఫీగా జరిగేలా చూడాలని అందర్నీ ఆయన కోరారు.

ఈ సందర్భంగా కొన్ని కీలక అంశాలపై చర్చలు జరగాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. వీటిపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ‘ఆపరేషన్ సిందూర్’పై జరిగే చర్చలు జరగనున్నాయి. విపక్షాల డిమాండ్లలో ఇది కూడా కీలకమైనది కావడంతో ఈ చర్చలు సాఫీగా సాగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story