Priyanka Gandhi: మా పోరాటం కొనసాగిస్తాం.. జీ రామ్‌ జీ బిల్లు ఆమోదంపై ప్రియాంక గాంధీ

by Prasad Jukanti |

‘జీ రామ్‌ జీ’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

Priyanka Gandhi: మా  పోరాటం కొనసాగిస్తాం.. జీ రామ్‌ జీ బిల్లు ఆమోదంపై  ప్రియాంక గాంధీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్, అజీవికా మిషన్‌–గ్రామీణ (వీబీ-జీ రామ్‌ జీ) (VB-G RAM G Bill) బిల్లు ఇవాళ లోక్‍సభలో ఆమోదం పొందింది. బిల్లుపై విపక్షాలు సభలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. చర్చ సందర్భంగా పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. విపక్షాల ఆందోళనల నడుమనే స్పీకర్ ఓంబిర్లా ఓటింగ్ నిర్వహించగా బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు పాస్ అయిన తర్వాత పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) .. బిల్లుకు వ్యతిరేకంగా తాము నిరసనలు చేపడతామని తెలిపారు. ఈ బిల్లు అమలులోకి వస్తే రాబోయే నెలల్లో నరేగా పథకం నిర్వీర్యం అవుతుందన్నారు. ఈ పథకం భారం రాష్ట్రాలపైకి మళ్లిన క్షణం నుంచే అది క్రమంగా అంతరించిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పేదల వ్యతిరేక బిల్లు అని పేర్కొ్న్నారు. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. కొత్త బిల్లుతో కార్మికుల హక్కులు తొలగిపోతాయని అన్నారు. మహాత్మా గాంధీ పేరును తొలగించడం ఆయనకే కాదు, దేశానికే అవమానం అని తెలిపారు.

Next Story