Lok Sabha: ఢిల్లీలో వాయు కాలుష్యం.. లోక్‌సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-04 04:14:33  IST  )

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యంపై తక్షణమే లోక్‌సభ (Lok Sabha)లో చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ఇవాళ కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్‌ (Manikyam Tagore) స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla)‌కు వాయిదా తీర్మానం ఇచ్చారు.

Lok Sabha: ఢిల్లీలో వాయు కాలుష్యం.. లోక్‌సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యంపై తక్షణమే లోక్‌సభ (Lok Sabha)లో చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ఇవాళ కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్‌ (Manikyam Tagore) స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla)‌కు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఢిల్లీని కమ్మేసిన కాలుష్య కోరల నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేస్తోందని తీర్మానంలో ఆయన ప్రస్తావించారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని పక్కన పెట్టి ఢిల్లీ కాలుష్యంపై చర్చ చేపట్టాలని ఢిల్లీ ప్రజలకు సాకులు కాదు, స్వచ్ఛమైన గాలి అవసరమని మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు.

కాగా, అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా (Deepender Singh Hooda) ఇదే వాయిదా తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు సమర్పించినప్పటికీ, ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులంతా పార్లమెంట్‌లో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాలుష్యం తీవ్రతను ఎత్తి చూపేందుకు కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా యాంటీ-పొల్యూషన్ మాస్క్ (Anti Pollution Mask) ధరించి సభకు హాజరయ్యారు. మరో కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ (Imran Masood) ఏకంగా ఆక్సిజన్ సిలిండర్‌ను తీసుకువచ్చి తమ నిరసనను తెలియజేశారు. కాలుష్యం స్థాయి ప్రమాదకరంగా మారి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తోందని విపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు.

Next Story