- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lok Sabha: వచ్చే నెల 10కి లోక్‌సభ వాయిదా.. ఐటీ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన కేంద్రం
దేశ ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న కొత్త ఆదాయపు పన్ను బిల్లు (New Income Tax Bill) పార్లమెంట్ (Parliament)లోకి రానే వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న కొత్త ఆదాయపు పన్ను బిల్లు (New Income Tax Bill) పార్లమెంట్ (Parliament)లోకి రానే వచ్చింది. విపక్షాల నిరసనల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) కొత్త ఐటీ బిల్లును లోక్‌సభ (Lok Sabha)లో ప్రవేశపెట్టారు. దీంతో చేసేదేమి లేక విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం కాసేపటికే లోక్‌సభను మార్చి10కి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) ప్రకటించారు. అయితే, 1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టానికి, 66 బడ్జెట్‌లలో ఇప్పటికే ఎన్నో సవరణలు చేశారు. ఫలితంగా ఐటీ చట్టం రాను రాను అత్యంత కష్టతరంగా మారింది. ట్యాక్స్ పేయర్లకు పెద్ద ఎత్తున వ్యయాలు పెరిగాయి.
ఈ క్రమంలోనే పాత ఐటీ చట్టాన్ని ప్రక్షాణ చేసి సులభతరం చేస్తామని గత వార్షిక బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ కొత్త ఐటీ చట్టాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) లోక్‌సభలో ప్రవేపెట్టారు. కొత్త ఐటీ చట్టాన్ని సమీక్షించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. చట్ట సమీక్షకు 22 ప్రత్యేక సబ్ కమిటీలను నిమమించింది. కొత్త చట్టం సమీక్షలో భాగంగా మొత్తం 6,500 సలహాలను ఆదాయ పన్ను విభాగం తీసుకుంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని కొత్త ఐటీ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఐటీ బిల్లును కేంద్రం సెలెక్ట్ కమిటీ (Select Committe)కి పంపనున్న నేపథ్యంతో సభను స్పీకర్ ఓం బిర్లా మార్చి 10కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.






