లోక్‌సభ రేపటికి వాయిదా

by Gantepaka Srikanth |

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. దీంతో సభలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

లోక్‌సభ రేపటికి వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. దీంతో సభలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. మహిళా సాధికారతకు విపక్షాలు అడ్డుపడ్డాయని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి దక్కిన విజయమని, దక్షిణాది రాష్ట్రాల గళాన్ని వినిపించడంలో తాము సఫలమయ్యామని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ఇతర నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. గత కొన్నేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్‌లో ఎదురైన అతిపెద్ద ఎదురుదెబ్బగా దీన్ని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. కాగా, ఈ బిల్లు ద్వారా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుండి 850కి పెంచాలని, తద్వారా 33% మహిళా కోటాను అమలు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. అయితే, డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశంపై దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు, విపక్ష 'ఇండియా' కూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గుతుందన్న భయంతో విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి బిల్లును అడ్డుకున్నాయి.

Next Story