విపక్షాల ఆందోళన.. లోక్‌సభ రేపటికి వాయిదా

by Muthe.Rajitha |

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల(Parliament Sessions) రెండవ రోజు, విపక్ష పార్టీల ఆందోళనల కారణంగా లోక్‌సభ(Loksabha) రేపటికి వాయిదా పడింది.

విపక్షాల ఆందోళన.. లోక్‌సభ రేపటికి వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల(Parliament Sessions) రెండవ రోజు, విపక్ష పార్టీల ఆందోళనల కారణంగా లోక్‌సభ(Loksabha) రేపటికి వాయిదా పడింది. ఇండియా కూటమి నేతలు బీహార్‌లో ఎన్నికల ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - SIR), ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రవాద దాడి వంటి అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సభ మొదలైన కొద్ది నిమిషాల్లోనే విపక్ష సభ్యుల నిరసనలతో మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.

అయినా నిరసనలు కొనసాగడంతో సభను రోజంతా వాయిదా వేసి, రేపు ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, విపక్షాలు చర్చకు డిమాండ్ చేస్తూనే సభను నడవనీయకుండా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ ఆందోళనల నడుమ, రాజ్యసభలో షిప్పింగ్ డాక్యుమెంటేషన్ చట్టాలను ఆధునీకరించే లాడింగ్ బిల్లు ఆమోదం పొందినప్పటికీ, లోక్‌సభలో వాయిదా తీర్మానాలపై చర్చ జరగలేదు.

Next Story