Lok Sabha : లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా

by Ramesh Naini |   (  Updated:2026-03-09 14:10:30  IST  )

దాదాపు నెల రోజుల విరామం తర్వాత పార్లమెంట్ బడ్జెట్ మలి విడత సమావేశాలు సోమవారం ఉదయం ఆరంభమయ్యాయి.

Lok Sabha : లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: దాదాపు నెల రోజుల విరామం తర్వాత పార్లమెంట్ బడ్జెట్ మలి విడత సమావేశాలు సోమవారం ఉదయం ఆరంభమయ్యాయి. అయితే, సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన సభ్యులకు లోక్‌సభ సంతాపం ప్రకటించింది. అనంతరం స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం తిరిగి సభ ప్రారంభమైన తర్వాత అసలు రాజకీయ పోరు మొదలయ్యే అవకాశం ఉంది.

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం

ఈ విడత సమావేశాల్లో అత్యంత కీలకమైన అంశం స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఈ తీర్మానాన్ని నోటీసుగా ఇచ్చాయి. మధ్యాహ్నం 12:15 గంటలకు ఈ తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది.

పశ్చిమాసియా ఉద్రిక్తతలపై రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన

Next Story