- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tamilanadu : తమిళనాడులో సంచలనం రేపుతున్న లాకప్ డెత్
తమిళనాడు(Tamilanadu)లో ఇటీవల జరిగిన ఓ లాకప్ డెత్ కేసు(Lockup Death Case) ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు(Tamilanadu)లో ఇటీవల జరిగిన ఓ లాకప్ డెత్ కేసు(Lockup Death Case) ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. తమిళనాడులోని సివగంగై జిల్లా తిరుప్పువనం పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనపై మద్రాసు హైకోర్ట్(Madras High Court) సీరియస్ కాగా, సీఎం స్టాలిన్ బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించారు. సివగంగై జిల్లాలోని మదపురం కాళీ అమ్మన్ ఆలయంలో భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్న 27 ఏళ్ల ఆజిత్ కుమార్‌ను ఆలయంలో జరిగిన దొంగతనం కేసులో ప్రశ్నించడానికి తిరుప్పువనం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులో ఉండగానే, ఆజిత్ కుమార్ ఆరోగ్యం క్షీణించిందని, సివగంగైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి, ఆ తర్వాత మదురైలోని మరో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
అయితే పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే అజిత్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆరోపించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసినప్పటికీ.. మద్రాస్ హైకోర్టు బెంచ్ స్వయంగా జోక్యం చేసుకుని సస్పెన్షన్ సరిపోదని, కఠిన చర్యలు తీసుకోవాలని మండిపడింది. అలాగే గత నాలుగేళ్లలో 24 లాకప్ మరణాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణాత్మక నివేదిక సమర్పించమని ఆదేశించింది. ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వగా.. AIADMK, BJP జ్యుడీషియల్ విచారణతోపాటు బాధిత కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాయి.






