మీ ఆధార్ కార్డు బయోమెట్రిక్ లాక్, అన్ లాక్ చేసుకోండిలా..!

by D.Reddy |   ( Updated:2025-01-28 02:58:29.0  )
మీ ఆధార్ కార్డు బయోమెట్రిక్ లాక్, అన్ లాక్ చేసుకోండిలా..!
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలోని ప్రతి పౌరుడి వివరాలను నమోదు చేసుకుని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) ఆధార్ కార్డులను(Aadhaar Card) జారీ చేస్తుంది. ఆధార్ నమోదు సమయంలో వ్యక్తిగత వివరాలు, బయోమెట్రిక్, ఐరీస్ ఇలా అన్నింటిని రికార్డు చేస్తారు. అయితే, ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోవడంతో UIDAI బయోమెట్రిక్ లాకింగ్ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో మనకు అవసరమైనప్పుడు అన్‌లాక్‌ చేసుకోవచ్చు.. అవసరం లేనప్పుడు లాక్‌ చేసుకోవచ్చు. ఇలా లాక్ చేసుకోవటం వల్ల మన ప్రమేయం లేకుండా బయోమెట్రిక్ వివరాలను వినియోగించడానికి కుదరదు.

ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేసుకొండిలా..

* ముందుగా యూఐడీఏఐ వెబ్‌సైట్‌ను(uidai.gov.in) సందర్శించాలి.

* 'మై ఆధార్(myAadhar)' ట్యాబ్‌పై క్లిక్ చేసి, 'ఆధార్ సేవలు(Aadhaar services)' కింద, 'ఆధార్ లాక్/అన్‌లాక్(Aadhaar Lock/Unlock)'పై క్లిక్ చేయాలి.

* ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.

* అనంతరం క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెండ్ OTPపై క్లిక్ చేయాలి.

* అనంతరం ఆధార్ కార్డుకు లింక్ చేసిన మొబైల్ నంబరుకు వచ్చిన OTPని ఎంటర్ చేయాలి

* స్క్రీన్‌పై ప్రదర్శించే నాలుగు అంకెల సెక్యూరిటీ కోడ్‌ను నమోదు చేసిన తర్వాత 'ఎనేబుల్(Enable)' బటన్‌ను క్లిక్ చేయాలి.

* Your Biometric Have Been Locked Successfully అని స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.

* అంతే.. ఆధార్‌ బయోమెట్రిక్‌ లాక్‌ అయిపోయినట్లే.

బయోమెట్రిక్ అన్‌లాక్ చేయటం ఎలా?

* ముందుగా యూఐడీఏఐ వెబ్‌సైట్‌ను(uidai.gov.in) సందర్శించాలి.

* 'మై ఆధార్(myAadhar)' ట్యాబ్‌పై క్లిక్ చేసి, 'Biometrics Unlock' ఫీచర్ పై క్లిక్ చేస్తే మీ ఫోన్ కు OTP వస్తుంది.

* OTPను నమోదు చేయాలి.

* 4 అంకెల పిన్‌ని సెట్ చేయాలి.

* మీ బయోమెట్రిక్ అన్‌లాక్ తాత్కాలికమా లేదా శాశ్వతంగానా అని అడుగుతుంది. ఇందులో మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.

* తాత్కాలికంగా అన్‌లాక్ ఆప్షన్ ఎంచుకుంటే కేవలం 10 నిమిషాలు మాత్రమే మీ బయోమెట్రిక్ అన్‌లాక్ అవుతుంది.

Next Story

Most Viewed