LOC: మరోసారి ఎల్‌వోసీ వద్ద కాల్పులకు తెగబడిన పాక్.. తిప్పికొట్టిన భారత బలగాలు

by Shiva |
LOC: మరోసారి ఎల్‌వోసీ వద్ద కాల్పులకు తెగబడిన పాక్.. తిప్పికొట్టిన భారత బలగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) మరోసారి తన వక్ర బుద్ధిని చూపించింది. జమ్ముకశ్మీర్‌ (Jammu Kashmir)లోని పూంచ్ జిల్లా (Poonch District) పరిధిలోని ఉన్న మెంధార్ సెక్టార్‌ (Mendhar Sector)లో బుధవారం రాత్రి నియంత్రణ రేఖ (LOC) వెంట గస్తీలో ఉన్న భారత సైన్యంపై ఆకస్మాత్తుగా కాల్పుల మోత మోగించింది. ఈ మేరకు పాక్ సైన్యం 10 నుంచి 15 రౌండ్ల పాటు ఏకధాటిగా పాల్పులు జరిపింది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం (Indian Army) కాల్పులతో సమర్ధవంతంగా దాడిని తిప్పి కొట్టింది. ఈ కాల్పుల్లో పాకిస్థాన్ (Pakistan) వైపు భారీగానే ప్రాణ నష్టం జరిగి ఉంటుందని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే, అఖ్నూర్ సెక్టార్‌ (Akhnoor Sector)లోని ఎల్‌ఓసీ (LOC) సమీపంలో అనుమానిత ఉగ్రవాదులు పెట్టిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (Improvised Explosive Device) పేలుడులో కెప్టెన్‌తో సహా ఇద్దరు భారత ఆర్మీ (Indian Army) సిబ్బంది వీర మరణం పొందారు. ఫిబ్రవరి 25, 2021న భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించినప్పటీకీ నియంత్రణ ఎల్ఓసీ (LOC) వెంట కాల్పుల విరమణ ఉల్లంఘన జరగడం చాలా అరుదు. కానీ, పాకిస్తాన్ ఈ ఏడాది మొదటిసారి కాల్పుల విరమణ ఉప్పందాన్ని ఉల్లంఘించింది.

ఆర్మీ అధికారికి గాయాలు..

బుధవారం రాత్రి మెంధార్ సెక్టార్‌ (Mendhar Sector)లోని ల్యాండ్‌మైన్‌ (Landmine)పై ప్రమాదవశాత్తు భారత సైన్యానికి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (Junior Commissioned Officer) కాలు పెట్టారు. దీంతో అతడికి స్వల్ప గాయాలైనట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు పెట్రోలింగ్ పార్టీ (Patrolling Party)తో గస్తీ కాస్తుండగా జేసీవో (JCO)కు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ఆయనను చికిత్స నిమిత్తం సమీపంలోని సైనిక ఆసుపత్రికి తరలించారు.

Next Story