- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Loc firing: భారత్‌ను రెచ్చగొడుతున్న పాక్.. ఎల్ఓసీ వద్ద మరోసారి కాల్పులు
ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్ భారత్‌ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లోని పహెల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ (India pakisthan) ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో పాక్ భారత్‌ను రెచ్చగొట్టడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా మూడో రోజూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఆదివారం పలు ప్రాంతాల్లో కాల్పులకు తెగపడింది. అయితే దీనిని భారత దళాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 26-27 రాత్రి టుట్మారి గాలి, రాంపూర్ సెక్టార్లకు ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో పాక్ ఆర్మీ తేలిక పాటి ఆయుధాలతో కాల్పులు జరిపిందని అధికారులు తెలిపారు. దీంతో ఎల్ఓసీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
కాగా, ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై భారత్ పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన పాక్ గత మూడు రోజులుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఎటువంటి కారణం పాక్ రెచ్చగొడుతోందని భారత్ ఆరోపిస్తోంది. మరోవైపు గత మూడు రోజుల్లో కశ్మీర్ లో 10 మంది ఉగ్రవాదుల ఇళ్లను భద్రతా దళాలు పేల్చివేశాయి.






