- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Union Budget : స్టార్టప్‌లకు గుడ్ న్యూస్.. ఎంఎస్‌ఎంఈలకు కలిపి రూ.20 కోట్ల వరకు రుణాలు
బడ్జెట్ 2025-26 ప్రసంగంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చిన్న తరహా, స్టార్టప్‌లకు వరాలు ప్రకటించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బడ్జెట్ 2025-26 (Union Budget 2025) ప్రసంగంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చిన్న తరహా, స్టార్టప్‌లకు వరాలు ప్రకటించారు. ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లకు దాదాపు 20 కోట్ల వరకు రుణాలు మంజూరు చేయనున్నారు. చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు ఎంఎస్‌ఎంఈ రుణం రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు కేంద్రం రుణాలు ఇస్తామని మంత్రి తెలిపారు. బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం తేనున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే పది సూత్రాల్లో రెండోది ఎంఎస్ఎంఈ రంగమని చెప్పారు. ఎగుమతుల్లో 45 శాతం వరకు ఎంఎస్ఎంఈలకు భాగస్వామ్యం ఉంటుందన్నారు.
ఎంఎస్ఎంఈలకు వచ్చే ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. 27 రంగాల్లో స్టార్టప్‌లకు రుణాల కోసం ప్రత్యేక కార్యచరణ తీసుకున్నట్లు తెలిపారు. నమోదు చేసుకున్న సూక్ష్మ పరిశ్రమ సంస్థలకు రూ.5 లక్షలతో క్రెడిట్ కార్డులు, ఎంఎస్ఎంఈలకు రూ.10 వేల కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.






