- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియాకు చేరుకున్న మెస్సీ..ఒక్క ఫోటో రూ.10 లక్షలా?
కోల్‌కతాలో పర్యటించిన తర్వాత, హైదరాబాద్ వస్తారు మెస్సీ. సాయంత్రం లోపు హైదరాబాద్ చేరుకుంటారు.

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఇండియా టూర్ మొదలైంది. ఇవాళ ఉదయమే భారత్ కు చేరుకున్నారు మెస్సీ. ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ తన సహచరులు రోడ్రిగో డి పాల్, సువారెజ్‌తో కలిసి కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. శనివారం తెల్లవారుజామున వారు ఇండియా టూర్ కోసం కోల్‌కతాలో అడుగుపెట్టారు. వారిని విమానాశ్రయం నుంచి భారీ భద్రత మధ్య తీసుకువస్తున్న తొలి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవాళ మధ్యాహ్నం వరకు కోల్‌కతాలో పర్యటించిన తర్వాత, హైదరాబాద్ వస్తారు మెస్సీ. సాయంత్రం లోపు హైదరాబాద్ చేరుకుంటారు. ఇక హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్ లో పాల్గొంటారు మెస్సీ. రేవంత్ రెడ్డి, మెస్సీ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత ఫోటో సెషన్ ఉంటుంది. మెస్సీతో పాటు ఫోటో దిగేందుకు పది లక్షల ఫీజు నిర్ణయించగా దాదాపు 60 మంది రిజిస్టర్ చేసుకున్నట్లు హైదరాబాద్ గోటు టూర్ అడ్వైజర్ పార్వతి రెడ్డి వెల్లడించారు.






