George Soros:దేశవ్యతిరేకశక్తులపై ఐక్యంగా పోరాడాలి.. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు

by Shamantha N |
George Soros:దేశవ్యతిరేకశక్తులపై ఐక్యంగా పోరాడాలి.. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi), హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త జార్జ్ సోరోస్(George Soros) మధ్య ఆర్థిక బంధాలున్నాయన్న ఆరోపణలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు(Union Minister Kiren Rijiju) స్పందించారు. ఆ ఆరోపణలు తీవ్రమైనవని అన్నారు. ఇటువంటి విషయాలను "రాజకీయ దృక్పథంతో" చూడరాదన్నారు. దీనిని రాజకీయంగా తిప్పికొట్టడం ఇష్టం లేదని ఆయన అన్నారు. "భారత వ్యతిరేక శక్తులకు"పై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. “ మేం పార్లమెంటును సజావుగా నడపాలనుకుంటున్నాము. కొన్ని సమస్యలను రాజకీయం చేస్తున్నారు. అయితే, భారత్ వెలుపల ఉన్న కొన్నిశక్తులు దేశానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రయత్నిస్తుంటే.. అది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం" అని రిజిజు అన్నారు.

జార్జ్ సోరోస్ ఫౌండేషన్ తో సంబంధాలు

అంతేకాకుండా కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలపైనా ఆయన స్పందించారు. ఆ విషయాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. అయితే, ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ నాయకత్వంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పుకొచ్చారు. "రాహుల్ గాంధీ ఇండియా కూటమికి నాయకత్వం వహించలేకపోతే అది వారి అంతర్గత విషయం, కానీ వారందరూ ఐక్యంగా లేరని తెలుస్తోంది" అని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే, సోనియాగాంధీ (Sonia Gandhi)పై బీజేపీ (BJP) సంచలన ఆరోపణలు చేసింది. అమెరికాకు చెందిన జార్జ్ సోరోస్ పౌండేషన్ (George Soros Foundation) నుంచి ఆర్థిక సాయం పొందే ఎఫ్‌డీఎల్-ఏపీ (FDL-AP) ఫౌండేషన్‌తో సోనియాగాంధీకి సంబంధాలున్నాయని ఆరోపించింది. జమ్మూకశ్మీర్‌ను స్వతంత్ర దేశం చేయాలనే భావజాలంతో ఎ‌ఫ్‌డీఎల్-ఏపీ పౌండేషన్ పనిచేస్తోందని సామాజిక మాధ్యమంలో 'ఎక్స్'లో బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. దీనిని బట్టి భారతదేశ అంతర్గత వ్యవహారాలు, రాజకీయ సంబంధాలపై విదేశీ సంస్థల ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చని పేర్కొంది.

Advertisement

Next Story