- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిడుగుల బీభత్సం.. 12 మంది మృతి, ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం
గడిచిన 24 గంటల్లో 6 జిల్లాల్లో 12 మంది పిడుగుల కారణంగా మరణించినట్లు బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: బీహార్ (Bihar)లో వరుసగా పిడుగులు (Thunderstorms) పడటం అక్కడి ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు భయపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6 జిల్లాల్లో 12 మంది పిడుగుల కారణంగా మరణించినట్లు బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.
బక్సర్ లో నలుగురు, వెస్ట్ చంపారన్ లో ముగ్గురు, కటహర్ లో ఇద్దరు, కైమూర్ లో ఒకరు, లక్షిసరాయ్ లో ఒకరు, సీతామర్హిలో ఒకరు పిడుగులు కారణంగా మరణించారు. మృతుల కుటుంబాలకు సీఎం సానుభూతి తెలిపారు. రాష్ట్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నక్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. విపత్తు నిర్వహణ సంస్థ చేసే సూచనలను పాటించాలని, వాతావరణం అనుకూలంగా లేని సమయంలో వీలైనంత వరకూ ఇంటికే పరిమితమవ్వాలని పిలుపునిచ్చారు.






