- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lightning Strike : బీహార్లో పిడుగుల బీభత్సం.. 25 మంది మృతి
బీహార్లో(Bihar) వడగళ్ళ వాన బీభత్సం సృష్టించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : బీహార్లో(Bihar) వడగళ్ళ వాన బీభత్సం సృష్టించింది. గురువారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, పిడుగులు(Lightning Strike), వడగళ్ళ వానల(Hailstroms) వల్ల 25 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు సీఎం నితీశ్ కుమార్(CM Nitish Kumar) సానుభూతి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. అయితే బుధవారం కూడా ఇదే తరహాలో వానలు పడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. నేడు 25 మంది చనిపోగా వారిలో ఒక్క నలంద జిల్లాలోనే 18 మంది మృతి చెందారు. మరికొద్ది రోజులు ఈ తరహా వర్షాలు పడే అవకాశం ఉన్నందున.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అయితే ప్రతియేటా పిడుగుల వలన బీహార్లో ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు. 2023 ఒక్క ఏడాదిలోనే 275 మంది పిడుగుల వర్షాలకు ప్రాణాలు వదిలారు.
Next Story






