- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lightning strike: యూపీలో పిడుగుపాటుకు 9 మంది మృతి.. సీఎం కీలక ఆదేశాలు
ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటుకు గురై 9 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ (Utharapradesh) లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటుకు గురై 9 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. లక్నో (Luknow), ప్రయాగ్‌రాజ్ (Prayagraj), సంభాల్, బిజ్నోర్, గోరఖ్‌పూర్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నట్టు అధికారులు ఆదివారం తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లోని సోన్‌వర్ష హల్లాబర్ గ్రామంలో శనివారం రాత్రి పిడుగుపాటుకు గురై ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారని తెలిపారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంటో పిడుగు పడిందని పేర్కొన్నారు.
పిడుగుపాటు, వరదల కారణంగా జరిగిన ప్రాణనష్టం పట్ల సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Yogi aadithyanath) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి సరైన వైద్య సహాయం, బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా పిడుగుపాటు ఘటనల వల్ల 25 మంది మరణంచినట్టు పలు కథనాలు వెల్లడించాయి.






