- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LGBTQ+ సమాజానికి జీవించే హక్కు ఉంది: ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సరసంఘచాలక్ మోహన్ భగవత్ LGBTQ+ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: LGBTQ+, లైంగిక మైనారిటీ కమ్యూనిటీలు సమాజంలో భాగమేనని, వారికి కూడా అందరిలాగే జీవించే హక్కు ఉందంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని కొమురం భీమ్ ఆదివాసి భవన్ (Komuram Bheem Adivasi Bhavan) లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో LGBTQ+, లైంగిక మైనారిటీ కమ్యూనిటీలు వంటి ధోరణులు శతాబ్దాలుగా ఉన్నాయని, వీటిలో కొన్ని ప్రకృతిసిద్ధంగా పుట్టుకతోనే వస్తే, మరికొన్ని శారీరక, మానసిక అలవాట్ల వల్ల ఏర్పడతాయని పేర్కొన్నారు. ప్రాచీన కాలం నుండి భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలలో వీరికి ఒక విశిష్ట స్థానం ఉందన్న ఆయన, సమాజంలో వీరిని ఎప్పుడూ వేరుగా, చిన్నచూపుతో చూడలేదని స్పష్టం చేశారు.
కుంభమేళా వంటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న పండుగలలో కూడా వీరి భాగస్వామ్యం, మహా సభలలో ప్రాతినిధ్యం ఉందని మోహన్ భగవత్ గుర్తుచేశారు. ఈ విషయాలపై అనవసర రచ్చ, ఆర్భాటం చేయకుండా, మానవీయ దృక్పథంతో వీరి కోసం సమాజంలో తగిన వసతులు, ఆమోదాన్ని అందించామని వివరించారు. LGBTQ+ వ్యక్తులను సమాజం నుండి వెలివేయకుండా, వారి ఉనికిని గౌరవిస్తూ వారిని సామాజిక జీవన స్రవంతిలో అంతర్భాగంగా గుర్తించడమే భారతీయ సాంప్రదాయమని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు.






