Leopard: పోలిస్ స్టేషన్‌లోకి చిరుతపులి.. కంప్లైంట్ ఇద్దామని వచ్చిందేమో? వైరల్

by Ramesh Naini |

అడవులకు దగ్గరగా ఉన్న పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వన్య మృగాలు, చిరుతపులులు సంచరించడం సర్వసాధారణం.

Leopard: పోలిస్ స్టేషన్‌లోకి చిరుతపులి.. కంప్లైంట్ ఇద్దామని వచ్చిందేమో? వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అడవులకు దగ్గరగా ఉన్న పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చిరుతపులులు, వన్య మృగాలు సంచరించడం సర్వసాధారణం. పెంపుడు జంతువుల పై దాడి చేయడంతో ఆ ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఓ చిరుతపులి సంచరిస్తున్న వీడియో తాజాగా నెట్టింట వైరల్ అయింది. అయితే ఆ చిరుతపులి ఏకంగా పోలీస్‌స్టేషన్‌కే (Leopard enters police station) రావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. (Tamil Nadu) తమిళనాడులోని నీలగిరి జిల్లా (Nilgiri) పోలీస్ స్టేషన్‌లోకి చిరుతపులి వెళ్లింది. స్టేషన్ మొత్తం తిరిగి ఎవరు లేకపోవడంతో చిరుత వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. చిరుత పులి స్టేషన్‌లో తిరిగిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. చిరుతపులి మెయిన్ డోర్ నుంచి లోపలికి ప్రవేశించి ఇన్స్పెక్టర్ రూమ్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఓ కానిస్టేబుల్ మరొక గదిలో కూర్చుని పని చేస్తున్నాడు.

చిరుతను గమనించిన కానిస్టేబుల్ షాక్‌కు గురై సైలెంట్ అయిపోయాడు. గదిలో తినడానికి ఏమీ లేదని గ్రహించిన చిరుతపులి మెట్లు దిగి, వచ్చిన దారిలోనే బయటకు వెళ్లింది. చిరుత పులి బయటకు వెళ్లిందని నిర్ధారించుకుని, కానిస్టేబుల్ స్టేషన్ తలుపులు మూసేశారు. చిరుత పోలీస్ స్టేషన్‌కు వచ్చిందని తెలుసుకున్న ఆ ప్రాంత ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. చిరుతను బంధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చిరుతకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే చిరుతను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. మరోవైపు వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఏమో దాని బాధలేమిటో! కంప్లైంట్ ఇద్దాం అని వచ్చిందేమో? నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

Next Story