చిరుత పై ఇటుకలతో దాడి.. వారిపై కేసు నమోదు

by Jakkula.Mamatha |

ఉత్తరప్రదేశ్‌లోని లిఖింపూర్‌లో ఇటుకల బట్టీలోకి చిరుతపులి ప్రవేశించి అక్కడే ఉన్న ఓ కూలీ పై దాడి చేసిన సంగతి తెలిసిందే.

చిరుత పై ఇటుకలతో దాడి.. వారిపై కేసు నమోదు
X

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని లిఖింపూర్‌లో ఇటుకల బట్టీలోకి చిరుతపులి ప్రవేశించి అక్కడే ఉన్న ఓ కూలీ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్, లఖీమ్ పుర్ ఖేరీ జిల్లా గిరిధర్ గ్రామానికి చెందిన మిహీలాల్(35) ఇటుకల బట్టీలో పని చేస్తున్నారు. అయితే అతను పని చేస్తున్న ఇటుకల బట్టీలోని చిమ్నీలో చిరుతపులి దాక్కొని ఉంది. ఆ విషయం తెలియని మిహీలాల్ ఇటుకల బట్టీ దగ్గరకు వెళ్లాడు.

దీంతో ఒక్కసారిగా లోపల చిరుతపులి దర్శనమిచ్చింది. అతడిని చూసిన చిరుత బయటకు వచ్చి దాడికి దిగింది. చిరుతను చూసి అతను భయపడకుండా.. ఒట్టి చేతుల్తో దాంతో పోరాటం చేశాడు. అతడిని రక్షించేందుకు అక్కడున్న వారు ఇటుకలను విసరగా, చిరుతకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ క్రమంలో చిరుత పులి పై రాళ్లు విసిరిన వారి పై తాజాగా వన్యప్రాణుల చట్టం కింద కేసు నమోదైంది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Next Story