Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 22 మంది మృతి

by B.Srinivas |

ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించింది.

Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 22 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హిజ్బుల్లా (Israel-Hezbollah) మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించింది. దక్షిణ లెబనాన్‌ (South lenabaon) పై తాజాగా దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 22 మంది మరణించగా, 124 మంది గాయపడ్డట్టు లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక లెబనాన్ సైనికుడు ఉన్నారు. సీజ్ ఫైర్ డీల్ ప్రకారం దక్షిణ లెబనాన్‌ నుంచి ఇజ్రాయెల్‌ సైన్యం వైదొగాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టిన వారిపై ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపినట్టు తెలిపింది. అనేక మంది ఆందోళన కారులు హిజ్బుల్లా జెండాలతో సరిహద్దు గ్రామాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా దాడి చేసినట్టు పలు కథనాలు వెల్లడించాయి.

కాగా, అమెరికా (America), ఫ్రాన్స్ (France) మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య గతేడాది నవంబర్ 27న కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం సౌత్ లెబనాన్ నుంచి 60 రోజుల్లో ఇజ్రాయెల్ దళాలను ఉపసంహరించుకోవాలి. అయితే ఈ నెల 25 వరకు ఈ గడువు ముగిసింది. అయినప్పటికీ తమ బలగాలను ఇజ్రాయెల్ అక్కడే ఉంచింది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ వారిపై కాల్పులు జరిపింది. మరోవైపు దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ దళాలు వైదొలగడానికి ఫిబ్రవరి 18 వరకు గడువు పొడిగిస్తున్నట్లు అమెరికా తెలిపింది.

Next Story