‘రెడీగా ఉండండి’.. యుద్ధనౌకల్లో పనిచేసే సిబ్బందికి సెలవులు రద్దు

by Gantepaka Srikanth |

ఇండియా(India), పాకిస్తాన్(Pakistan) మధ్య పరిస్థితులు అంతకంతకూ దిగజారుగుతున్నాయి.

‘రెడీగా ఉండండి’.. యుద్ధనౌకల్లో పనిచేసే సిబ్బందికి సెలవులు రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా(India), పాకిస్తాన్(Pakistan) మధ్య పరిస్థితులు అంతకంతకూ దిగజారుగుతున్నాయి. ఇరు దేశాలు సైనికులను అప్రమత్తం చేయడంతో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు.. ఉగ్రవాదులు ఎటాక్‌ చేసిన ప్రాంతంలో భద్రతా బలగాలు అనువణవూ గాలిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ మరో కీలక స్టెప్ తీసుకుంది. అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నావికాదళాలనికి ఆదేశాలు జారీ చేసింది. పూర్తి సన్నద్ధతతో ఉండాలని సన్రైజ్ఫ్లీట్కు ఆదేశాలిచ్చింది. శుక్రవారం పరిస్థితి స్వయంగా ENC చీఫ్ పెందార్కర్ సమీక్షించారు. యుద్ధనౌకలు, సబ్ మెరైన్లలో పని చేసే సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. అరేబియా సముద్రంలో ఎయిర్క్రాఫ్ట్ కారియర్ విక్రాంత్(INS Vikrant) మోహరించింది. దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ పొడవు 262 మీటర్లు.. వెడల్పు 59 మీటర్లు ఉంటుంది. ఇది 40 యుద్ధ విమానాలను స్వయంగా మోసుకెళ్లగలదు. INS విక్రాంత్ జనరల్ ఎలక్ట్రిక్‌లో శక్తివంతమైన టర్బైన్లతో అమర్చబడి ఉంది. ఈ యుద్ధనౌకలో 2 స్క్వాడ్రన్ల మిగ్ 29 ఫైటర్ జెట్లు, 10 క్కావ్ కా - 31 హెలికాప్టర్లు ఉన్నాయి. ఈ విమాన వాహక నౌక స్ట్రైక్ ఫోర్స్ పరిధి 1500 కి.మీ. ఇందులో 64 బరాక్ క్షిపణులతో ఉన్నాయి. ఇవి ఓడ నుండి గగనతలానికి దాడులు చేయగలవు.

మరోవైపు.. ఇప్పటికే పాకిస్తాన్‌తో భారత్ దౌత్య సంబంధాలు తెంచుకుంది. పాక్ దేశీయులు ఇండియా విడిచి వెళ్లాలని వీసాలు రద్దు చేసింది. సింధుజలాలపై ఆంక్షలు విధించింది. అన్ని రకాల ట్రేడింగ్స్‌ను రద్దు చేసుకుంది. భారత్ నిర్ణయంతో పాకిస్తాన్ కూడా అన్ని రకాల ట్రేడింగ్స్ రద్దు చేసుకుంది. పాక్‌లో ఉన్న భారతీయులను ఇండియాకు వెళ్లిపోవాలని చెప్పింది. ఈ నేపథ్యంలో INS విక్రాంత్‌ను అరేబియా సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టడం చూస్తుంటే యుద్ధం రాబోతుందా? అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది.

Next Story