- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగళూరులో ఆల్‌ఖైదా టెర్రర్ మాడ్యుల్ మాస్టర్ మైండ్ అరెస్టు
అల్-ఖైదా ఇండియన్ సబ్ కంటినెంట్ (AQIS) ఉగ్రవాద మాడ్యూల్‌కు సంబంధించిన ప్రధాన కుట్రదారుని గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్ట్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: అల్-ఖైదా ఇండియన్ సబ్ కంటినెంట్ (AQIS) ఉగ్రవాద మాడ్యూల్‌కు సంబంధించిన ప్రధాన కుట్రదారుని గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్ట్ చేసింది. 30 ఏళ్ల షమా పర్వీన్‌గా గుర్తించిన నిందితురాలిని కర్ణాటకలోని బెంగళూరులో అరెస్ట్ చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. షమా పర్వీన్ ఈ మాడ్యూల్‌ను నడిపిస్తూ, కర్ణాటక నుంచి కార్యకలాపాలను సమన్వయం చేస్తున్న ప్రధాన హ్యాండ్లర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అరెస్ట్‌కు ముందు, జులై 23న గుజరాత్, ఢిల్లీ, నోయిడాలో 20 నుంచి 25 ఏళ్ల వయస్సు గల నలుగురు ఉగ్రవాద అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
మొహ్ద్ ఫర్దీన్, సెఫుల్లా కురేషి, జీషాన్ అలీ, మరియు మొహ్ద్ ఫైక్‌గా గుర్తించిన ఈ నిందితులు సోషల్ మీడియా యాప్ ద్వారా ఒకరితో ఒకరు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. వీరు భారతదేశంలోని ప్రముఖ లక్ష్యాలపై దాడులు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ గ్రూప్‌కు సరిహద్దులు దాటిన సంబంధాలు ఉన్నాయని, విదేశాల్లోని హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ప్రముఖ స్థలాలపై సమన్వయ దాడులు చేయడానికి వీరు ప్రణాళికలు రచిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. తాజాగా ఐక్యరాష్ట్ర సమితి (UN) నివేదిక ప్రకారం, అల్-ఖైదా భారత ఉపఖండంలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు చురుకుగా ప్రయత్నిస్తోంది. UN సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క 1267 శాంక్షన్స్ కమిటీ యొక్క 32వ నివేదికలో, AQIS ఎమిర్ ఒసామా మెహమూద్ నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్, బంగ్లాదేశ్, మయన్మార్‌లలో కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు హెచ్చరించింది.






