- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rahul Gandi: రాహుల్ జీ ఇదేం పని.. ప్రాణహాని అప్లికేషన్ పై యూ టర్న్
గాడ్సే వారసుల నుంచి ప్రాణహాని ఉందని రాహుల్ గాంధీ అడ్వకేట్ దాఖలు చేసిన అప్లికేషన్ పై యూ టర్న్ తీసుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గాడ్సే వారసులతో తనకు ప్రాణహాని ఉందని నాకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనంటూ పుణె కోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దాఖలు చేసిన అప్లికేషన్ విషయంలో ఏ/v అడ్వకేట్ యూ టర్న్ తీసుకోవడం రాజకీయం దుమారం రేపుతోంది. సావర్కర్ (Savarkar) పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి నాథూరాం గాడ్సే వారసుడని వారి వంశంలోనే హింస, రాజ్యాంగ వ్యతిరేక ఆలోచనలు ఉన్నాయని వారితో నా ప్రాణాలకు హాని ఉందని రాహుల్ గాంధీ తరఫున అడ్వకేట్ ఆరోపించారు. రాహుల్ గాంధీకి ప్రభుత్వమే రక్షణ కల్పించాలని కోరారు. అయితే కోర్టులో ఈ అప్లికేషన్ సమర్పించిన గంటల వ్యవధిలోనే ఈ అప్లికేషన్ ను వెనక్కి తీసుకోబోతున్నామని రాహుల్ గాంధీ తరఫున అడ్వకేట్ డ్వకేట్ మిలింద్ దత్తాత్రేయ పవార్ ప్రకటించడం రాహుల్ గాంధీని ఇరుకున పెట్టినట్లైంది. ఇంతకీ ఏం జరిగిందంటే
తప్పంతా నాదే?:
ప్రాణహాని ఉందని కోర్టులో రాహుల్ గాంధీ తరఫున అడ్వకేట్ మిలింద్ దత్తాత్రేయ పవార్ దరఖాస్తు చేశారు. అయితే ఈ అప్లికేషన్ పై రాహుల్ గాంధీ అనుమతి లేకుండా అడ్వకేట్ కోర్టులో సమర్పించారని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. అడ్వకేట్ మిలింద్ దత్తాత్రేయ పవార్ సైతం ఓ ప్రకటన విడుదల చేశారు. నాకు అనిపించింది, తగినది అని భావించి ఈ అప్లికేషన్ దాఖలు చేశానని రాహుల్ గాంధీతో నేను ఎప్పుడు నేరుగా మాట్లాడలేదని తాను ఇచ్చిన అప్లికేషన్ ను వెనక్కి తీసుకుంటానని నిన్నే ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇలాంటి టైంలో ఇదేం పని?:
దీంతో రాహుల్ గాంధీ ప్రమేయం లేకుండానే అడ్వకేట్ ఈ అప్లికేషన్ నమోదు చేయడం ఇప్పుడు రాజకీయంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తన న్యాయవాది కూడా సీరియస్‌గా తీసుకోని వ్యక్తిని ఈ దేశం ఎలా పట్టించుకుంటుందని సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. ఓట్ల చోరీ అంశంపై ఉద్యమాన్ని ఉధృతం చేసే ప్లాన్ తో ఉన్నారు. వచ్చే సారి తప్పకుండా బీజేపీని గద్దె దించుతామని ప్రతిన చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఇలాంటి నవ్వులాట పనులు చేయడం ఏంటని ఇకనైనా రాహుల్ గాంధీ ఇలాంటి విషయాల్లో సీరియస్ గా వ్యవహరించాలని కాంగ్రెస్ అభిమానులు సైతం పెదవి విరుస్తున్నారు.






