- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రెండింగ్‌లో ‘లాస్ ఆఫ్ వర్జినిటీ’..! డ్యూరెక్స్ సర్వేలో సంచలన విషయాలు
ప్రపంచవ్యాప్తంగా తొలి లైంగిక అనుభవం పొందే సగటు వయసుపై ‘డ్యూరెక్స్’ సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

దిశ, వెబ్‌డెస్క్: నేటి ఆధునిక ప్రపంచంలో మారుతున్న జీవనశైలికి అనుగుణంగా యువత ఆలోచనా ధోరణిలోనూ మార్పులు వస్తున్నాయి. అయితే, మొదటిసారి లైంగిక అనుభవాన్ని పొందే వయసు విషయంలో దేశాల మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నట్లుగా ‘డ్యూరెక్స్’ (Durex) తాజా సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ నివేదికలో సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. ఈ జాబితాలో ఆసియా దేశాలు అత్యధిక వయసుతో మొదటి వరుసలో ఉండగా, ఐరోపా దేశాలు అతి తక్కువ వయసుతో చివరి వరుసలో ఉన్నాయి. సంప్రదాయాలకు, కుటుంబ విలువలకు పెద్దపీట వేసే ఆసియా (Asia) దేశాల్లో తొలి లైంగిక అనుభవం పొందే సగటు వయసు ఎక్కువగా ఉంది. 23 ఏళ్లతో ఈ జాబితాలో మలేషియా (Malaysia) అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్ (India)లో సగటున 22.9 ఏళ్ల వయసులో యువత తమ మొదటి లైంగిక అనుభవాన్ని పొందుతున్నట్లుగా నివేదికలో తేలింది. సింగపూర్ (22.8), చైనా (22.1) వంటి దేశాలు కూడా దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి.
యూరోపియన్ దేశాల్లో తక్కువ వయసులోనే..
యూరోప్ దేశాల్లో లాస్ ఆఫ్ వర్జినిటీ (Loss of Virginity)కి కారణాలు చాలా ఉన్నాయి. పాఠశాల స్థాయి నుంచే శాస్త్రీయమైన లైంగిక విద్యను అందించడం వల్ల అక్కడి యువతకు దీనిపై పూర్తి అవగాహన ఉంటుంది. వ్యక్తిగత నిర్ణయాలకు సమాజం ఇచ్చే ప్రాధాన్యత ఎక్కువ కావడంతో ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి. అక్కడ డేటింగ్ సంస్కృతి చాలా సాధారణనమైన విషయం. సంప్రదాయ మతపరమైన ఆంక్షలు తక్కువగా ఉండటం కూడా ఓ కారణమే. అమెరికాలో సగటున 18 ఏళ్లు, బ్రిటన్‌లో 18.3 ఏళ్లు, జర్మనీలో 17.6 ఏళ్లు, బ్రెజిల్‌లో 17.4 ఏళ్లలో యువత వర్జినిటీ కోల్పోతున్నారు.
అత్యంత తక్కువ వయసు ఇక్కడే..
ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ వయసులోనే లైంగిక అనుభవం పొందే దేశంగా 15.6 ఏళ్లుతో ఐస్లాండ్ (Iceland) నిలిచింది. దీని తర్వాత డెన్మార్క్ 16.1, స్వీడన్ 16.2, నార్వే 16.5 వంటి నార్డిక్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో లైంగిక విద్యపై ఉన్న అవగాహన, సామాజిక స్వేచ్ఛ ఇందుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. సాంస్కృతిక కట్టుబాట్లు, మతపరమైన నమ్మకాలు, సెక్స్ ఎడ్యుకేషన్ ఆయా దేశాల్లోని యువత నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయని ‘డ్యూరెక్స్ సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో వివాహం తర్వాతే లైంగిక సంబంధం అనే భావన ఇంకా బలంగా ఉండటమే ఇక్కడ సగటు వయసు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.






