- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెనిజులాలో తాజా పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి: MEA
వెనిజులాలో తాజా పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా సైన్యం మెరుపు దాడులు, వెనిజులా అధ్యక్షుడి అరెస్ట్ తో ఆ దేశంలో ఒక్కసారిగా ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. వెనిజులాలో తాజా పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో వెనిజులాలో వేగంగా మారుతున్న పరిస్థితులను తాము నిశితంగా గమనిస్తున్నామని. వెనిజులా ప్రజల శ్రేయస్సు, భద్రతకు భారత్ తన మద్దతును పునరుద్ఘాటిస్తోందని ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ, సంబంధిత పక్షాలన్నీ సమస్యలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తాము కోరుతున్నామని ఆ ప్రకటనలో MEA తెలిపింది. అలాగే కరాకస్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడ ఉన్న భారతీయ సమాజంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తూనే ఉంటుందని విదేశాంగ శాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే అమెరికా సైన్యం అదుపులో వెనిజులా అధ్యక్షుడు ఉన్నాడు. అయితే ఆ దేశాన్ని పూర్తిగా ఆక్రమించిన ట్రంప్.. తామే వెనిజులాను తాత్కాలికంగా నడిపిస్తామని ప్రకటించారు.






