పాక్ వైఖరిపై కాశ్మీర్‌లో అర్ధ‌రాత్రి నిరసనలు!

by velandi.Saikiran |

శ్రీనగర్, బుద్గాంలలో ప్రజలు రోడ్లపైకి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పాక్ వైఖరిపై కాశ్మీర్‌లో అర్ధ‌రాత్రి నిరసనలు!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: పాకిస్తాన్ వైఖరి కారణంగా కాశ్మీర్ లో నిరసనలు జరుగుతున్నాయి. ఇస్లామాబాద్ లోని షియా మసీద్ పైన ఘోర ఆత్మహతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిని నిరసిస్తూ కాశ్మీర్ లోని పలు ప్రాంతాలలో భారీ నిరసనలు జరిగాయి. అర్ధరాత్రి పూట జనాలందరూ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దాడులను అరికట్టడంలో పాకిస్తాన్ స‌ర్కార్‌ విఫలమైందని నిరసనకారులు మండిపడ్డారు.

శ్రీనగర్, బుద్గాంలలో ప్రజలు రోడ్లపైకి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా ఈ దాడిలో మృతుల సంఖ్య 69 కి చేరినట్లు సమాచారం అందుతోంది. వందలాది మది తీవ్రంగా గాయపడ్డారు. అటు పాకిస్తాన్ ను ఉగ్ర భూతం వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశంలో ముష్కరులు రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు. ఈ విపత్తును అరికట్టేందుకు పాకిస్తాన్ భద్రత దళాలు కీలకమైన చర్యలు చేపడుతున్నాయి. ఇంటలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లను కూడా వేగవంతం చేసింది పాకిస్తాన్ సైన్యం.



Next Story