నీళ్లు ఆపుతే మోడీ శ్వాస ఆపేస్తాం..హఫీజ్ పాత వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

క‌శ్మీర్‌లో ఉగ్రదాడి తరవాత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఉందన్న

నీళ్లు ఆపుతే మోడీ శ్వాస ఆపేస్తాం..హఫీజ్ పాత వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: క‌శ్మీర్‌లో ఉగ్రదాడి తరవాత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఉందన్న నేపథ్యంలో ఆ దేశంపై భారత్ ఆంక్షలు విధించింది. పాకిస్థానీలు భారత్ ను విడిచి వెళ్లిపోవాలని ప్రధాని మోడీ ప్రకటించారు. అదే విధంగా సింధూ నది జలాలపై కూడా ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆ నదీ జలాలను పాకిస్థాన్ వెళ్లనివ్వం అని చెప్పారు. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ మోడీకి వార్నింగ్ ఇచ్చిన వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.మీరు పాకిస్థాన్ కు నీళ్లు ఆపుతారా.. మీరు డ్యాములు కట్టి నీళ్లు ఆపుతే మేం మీ శ్వాసం ఆపేస్తాం, ఆ నదుల్లో మీ రక్తం పారుతుంది..అంటూ వార్నింగ్ ఇచ్చారు. హఫీజ్ గతంలో మోడీపై ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రస్తుతం పాకిస్థానీలను రెచ్చగొట్టడం కోసం వైరల్ చేస్తున్నారు. మరోవైపు ఇండియా పాక్ మధ్య యుద్ధవాతావరణం కనిపిస్తోంది. పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే భారత్ తిప్పికొట్టేందుకు సిద్దమవుతోంది.

Next Story