- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress Vs BJP: మోడీ ఫోటో పోస్టుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
పహెల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకాలేదు. దీంతో, కాంగ్రెస్ మోడీపై విమర్శలు గుప్పించింది.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకాలేదు. దీంతో, కాంగ్రెస్ మోడీపై విమర్శలు గుప్పించింది. మోడీని లక్ష్యంగా చేసుకుని తల లేని ఫొటోను సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేసింది. అందులో ప్రధాని మోడీ తల కనిపించడం లేదు.“బాధ్యతాయుత సమయంలోనే మాయమవుతారు” అని గాయబ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆ ఫొటోకు జతచేసింది. కాగా.. కాంగ్రెస్ షేర్ చేసిన ఫొటోనే పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ అహ్మద్ హుస్సేన్ చౌదరి కూడా షేర్ చేశారు. "గాడిద తల నుండి కొమ్ములు తప్పిపోయాయని విన్నాను. కానీ, ఇక్కడ మోడీ తప్పిపోయారు" అని రాసుకొచ్చారు.
బీజేపీ విమర్శలు
కాగా.. కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా దీనిపై స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్టుపై మండిపడ్డారు. కాంగ్రెస్ ని పాకిస్థాన్ మద్దతుదారు అని విమర్శించారు. "మన మధ్యే ఒక జాతీయ రాజకీయ పార్టీ ఉంది. కానీ మనం వారిని లష్కరే పాకిస్థాన్ కాంగ్రెస్ అని పిలిస్తే తప్పే కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రాన్ని కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భారతదేశంలో మీర్ జాఫర్ మద్దతుదారులు ఉన్నారని పాకిస్థాన్‌కు కాంగ్రెస్ బలమైన సందేశం ఇచ్చింది. 'సర్ తన్ సే జుడా' ఇప్పుడు లష్కరే పాకిస్తాన్ కాంగ్రెస్ సిద్ధాంతంగా మారింది. రాహుల్ గాంధీ సూచనల మేరకు ఇలాంటి పోస్టులు చేస్తున్నారు. ఇది దేశాన్ని సిగ్గుపడేలా చేస్తుంది. ఇంత సున్నితమైన సమయంలో భారతదేశాన్ని బలహీనపరిచేందుకు లష్కరే పాకిస్థాన్ కాంగ్రెస్ చేసిన ప్రయత్నం ఇది." అని మండిపడ్డారు. బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వీయా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. ఇది ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తి పరచడమే లక్ష్యంగా పెట్టుకుందిని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిపై హింసను ప్రేరేపించి సమర్థిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఇంతచేసినా.. కాంగ్రెస్ ఎప్పటికీ విజయం సాధించదన్నారు. ప్రధాని మోడీకి లక్షలాది మంది భారతీయుల ప్రేమ, ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
స్పందించిన జైరాం రమేశ్
కాగా.. ఈ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందించారు. "ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశంలో పాల్గొనలేదు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని మేం ఏప్రిల్ 22న డిమాండ్ చేశాం. మోడీ పార్లమెంటులో చర్చల్లో పాల్గొని ఈ ఉగ్రవాద దాడి ఏమి జరిగిందో, ఎలా జరిగిందో మాకు చెప్పాలి. రాజకీయ ఎజెండా ఏమీ లేదు. కాంగ్రెస్ కు ఒకే ఒక ఫార్ములా ఉంది. అదే ఐక్యత" అని ఆయన అన్నారు. మరోవైపు, పహెల్గాం దాడిపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రికి లేఖ రాశారు.






